NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా స్థాయి విలువిద్య పోటీలను ప్రారంభించిన డాక్టర్. శంకర్ శర్మ…

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు అవుట్ డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి విలువిద్య పోటీలను ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ ప్రారంభించారు. విలువిద్య సంఘం కార్యదర్శి నాగరత్నమయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఈసందర్భంగా డాక్టర్. శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల నైపుణ్యం, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. కులాలను, మతాలను, ప్రాంతాలను ఏకం చేసి దేశభక్తిని కలిగించే శక్తి ఒక్క స్పోర్ట్స్ కే ఉంటుందన్నారు. విలువిద్య ఎంతో ప్రాచీనమైనదని ఒలంపిక్స్ లో సైతం భారతీయులు పథకాలు సాదించారని డాక్టర్. శంకర్ శర్మ తెలిపారు.ఇలాంటి క్రీడల్లో చిన్నారులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కర్నూలు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పేరు సాధించాలని డాక్టర్. శంకర్ శర్మ కోరారు.

About Author