NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నూతన స్వచ్ఛ రథం వాహనం ప్రారంభం

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాల సమర్థ నిర్వహణకు కీలకమైన చర్య ప్రారంభమైంది. ప్రతి ఇంటి నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు ఏర్పాటు చేసిన నూతన “స్వచ్ఛ రథం” వాహనాన్ని డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు  కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా శనివారం ఎమ్మెల్యే మాట్లాడుతూ “తుక్కు ఇవ్వండి… సరకులు తీసుకోండి” అనే నినాదంతో ఈ స్వచ్ఛ రథం ఇంటింటికీ వెళ్లి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తుంది. ప్రజలు తమ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను అందిస్తే, వాటి బదులుగా నిత్యావసర సరుకులను రథం సిబ్బంది అందజేస్తారు. సేకరించిన వ్యర్థాలను రీసైక్లింగ్‌కు పంపడం ద్వారా పర్యావరణ సంరక్షణకు ఈ కార్యక్రమం దోహదపడనుంది అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి కలిగే దుష్ప్రభావాలను తగ్గించాలంటే ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రజల చురుకైన భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే వ్యర్థాల సరైన నిర్వహణ తప్పనిసరిగా అమలు చేయాలని ఎమ్మెల్యే  తెలిపారు .ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీనివాసరావు,ఎపిఓ రవి,ఎస్ఐ నాగార్జున, ఈఓ శివకుమార్ గౌడ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మధుసూదన్, తేదేపా మండల ఇన్చార్జి ఎద్దుల దొడ్డి ప్రభాకర్ రెడ్డి, తేదేపా సివియర్ నాయకులు లక్ష్మీ నారాయణ యాదవ్, ,ముస్లిం మైనార్టీ నాయకులు ఖాజా ఫీర్, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, తేదేపా  జనరల్ సెక్రెటరీ నడిగడ్డ నాగేంద్ర, తేదేపా మండల అధ్యక్షుడు కొంగనపల్లి మధు, మండల కన్వీనర్ సుదర్శన్, మాజీ ఎంపిటిసి గోల్ల రామ్మోహన్ యాదవ్, ప్రిన్సిపల్ మధు, పుల్లయ్య వెంకటేష్,బాలక్రిష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు   తదితరులు పాల్గొన్నారు.

About Author