NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

1 min read

ఆలూరు న్యూస్ నేడు: చిప్పగిరి గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ గుండమాంబ అవ్వ గుడి దగ్గరకు సీసీ రోడ్ వేయుటకు శ్రీ వైకుంఠం శివప్రసాద్ వైకుంఠం జ్యోతి  సీసీ రోడ్డు కొరకు అధికారులతో మాట్లాడి ఎంజిఎన్ఆర్ఇజిఎస్ ద్వారా 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అందుకుగాను  భూమి పూజ నిర్వహించడం జరిగింది. సిసి రోడ్ శాంక్షన్ చేసినందుకు శ్రీ వైకుంఠం శివప్రసాద్  మరియు ఆలూరు టిడిపి ఇన్చార్జి  వైకుంఠం జ్యోతి  గ్రామ ప్రజలు మరియు ప్రత్యేకంగా బలిజ సోదరులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపడం జరిగింది. బలిజ సోదరులు మాట్లాడుతూ మేము అడిగిన వెంటనే సి సీ రోడ్ శాంక్షన్ చేసినటువంటి వైకుంఠం శివప్రసాద్ దంపతులకు ఎల్లవేళలా ఎన్ని కష్టాలు వచ్చినా వారి వెంటే వెన్నంటే ఉండి మరి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటామని హర్షద్వానాలతో చెప్పడం జరిగినది. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కొండ రామాంజనేయులు  దేవరగట్టు ఆలయ కమిటీ డైరెక్టర్ దేవక్క  జయన్న చిప్పగిరి గ్రామ అధ్యక్షులు వెంకటేష్  చిప్పగిరి గ్రామ సర్పంచ్ దాసరి గోవిందరాజులు సీనియర్ నాయకులు కొండా కాయ పెద్దన్న మరియు బిజెపి మండల కన్వీనర్ ఆరుసార్ల గోపాల్  ప్రభాకర్ జనార్దన్ స్వామి బోగేష్ స్వామి మరియు తదితర టిడిపి నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది. ఈ పూజ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

About Author