NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైద్య రంగంలో నిరంతర శోధన తప్పనిసరి..

1 min read

డాక్టర్ చంద్రశేఖర్, వైస్ ఛాన్స్ లర్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ,

కర్నూలు హాస్పిటల్, న్యూస్ నేడు : వైద్య రంగంలో నిరంతర శోధన తప్పనిసరి అని వైద్యశాస్త్రంలో నూతన ఆవిష్కరణలు ఎప్పటికప్పుడు జరుగుతుంటాయని వాటిని తెలుసుకోవడం తప్పనిసరి అని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ పి చంద్రశేఖర్ అన్నారు.  శనివారం కర్నూల్ మెడికల్ కాలేజీలో  ఆర్థోపెడిక్ సర్జన్స్ సొసైటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (OSSI) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 55వ OSSAPOCON–2026 రాష్ట్రస్థాయి మూడు రోజుల ఆర్థోపెడిక్ కాన్ఫరెన్స్ కు రెండవ రోజు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యశాస్త్రంలో నూతన ఆవిష్కరణలను వైద్యులు నిరంతరం శోధిస్తూ తెలుసుకుంటేనే రోగులకు మరింత మెరుగైన ఖచ్చితమైన చికిత్సలు అందించవచ్చని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నూతన ఆవిష్కరణలకు ఎప్పుడూ ప్రోత్సాహం ఇస్తుందన్నారు. రీసెర్చ్ ఆక్టివిటీకి ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నామన్నారు. ఆర్థోపెడిక్ రాష్ట్రస్థాయి ఈ సదస్సుకు కర్నూలు మెడికల్ కాలేజీ నిర్వహించడం మంచి పరిణామం ఆర్థోపెడిక్ విభాగంలో ఎన్నో నూతన ఆవిష్కరణలు జరుగుతున్నాయని ఎంతో ఉపయోగపడుతుందన్నారు.ఈ కార్యక్రమానికి ఎడియంఇ, ప్రిన్సిపాల్ డా. చిట్టి నరసమ్మ, ఏ.డి.ఎం.ఇ, సూపరిండేంట్ డా. వెంకటేశ్వర్లు, ఓసాప్కాన్ ప్రెసిడెంట్ సెక్రటరీ లు డా. అశోక్ కుమార్, డా. విజయ కృష్ణారెడ్డి, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాసులు, సెక్రటరీలు ఇలియాస్ భాష, కో చైర్మన్ డా. రమణ , సైంటిఫిక్ కమిటీ డా. రాజయ్య, డా. అచ్యుత రావ్, జాయింట్ సెక్రెటరీ డా రాజేష్, ఏపీఎంసీ అబ్జర్వర్ డా. వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

About Author