కేంద్ర మంత్రి కుమారస్వామికి ఆత్మీయ స్వాగతం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు : కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా కర్నూలు ఎయిర్పోర్ట్ కి విచ్చేసిన కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామి కి జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఆత్మీయ స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ అమ్మవారి దేవాలయం, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనం నిమిత్తం కర్నూలు ఎయిర్పోర్ట్ కి విచ్చేసిన కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామి గారికి జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం మంత్రి రోడ్డు మార్గంలో అలంపురం బయలుదేరి వెళ్లారు. అక్కడ వెలసిన జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జిల్లాలో ఏర్పాటు కానున్న పరిశ్రమలు, ఇతర అభివృద్ధి పనుల పురోగతి పై కలెక్టర్ మంత్రికి వివరించారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, డీఎస్పీ బాబు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

