” జిల్లా జైలులో భోజనం, వసతులను పరిశీలించిన బోర్డ్ ఆఫ్ విజిటర్ సభ్యుల బృందం ”
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక జిల్లా కారాగారం ను సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటైన బోర్డ్ ఆఫ్ విజిటర్స్ బృందం మంగళవారం నాడు సందర్శించారు. ఈ బృందంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థి, కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి,జాయింట్ కలెక్టర్ నూరుల్ కామర్ మరియు జిల్లా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా, ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఖైదీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు,యోగక్షేమాలు సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు అందిస్తున్న భోజనం, వసతులు, బ్యారెకుల పరిస్థితి పరిశుభ్రత, జైలు ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, జైలు కిచెన్ మొదలగు వాటిని పరిశీలించారు. అధికారులు స్వయంగా ఖైదీల భోజనాన్ని రుచి చూసి నాణ్యత పై సంతృప్తి వ్యక్తం చేశారు. జైలు రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందుతున్న విధానం, బెయిల్ మంజూరు, వాటి పరిస్థితి, షూరిటీ లేని ఖైదీలకు వ్యక్తిగత బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి మార్గదర్శకాలు చేశారు. జైలు ప్రాంగణంలోని పచ్చదనం, పరిశుభ్రత, క్రమశిక్షణ పై బోర్డు సభ్యులు సంతృప్తి వ్యక్తం చేస్తూ పెండింగ్ సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి జైలు నందు ఏర్పాటు చేసిన ప్రిజన్ లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్ మరియు క్లినిక్ ను తనిఖీ చేశారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100 పై ప్రచారం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బోర్డ్ ఆఫ్ విజిటర్స్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ రాధిక, జిల్లా అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ వరలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిడబ్ల్యుడి విజయరాజు, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ దీప్తి, జిల్లా ఇండస్ట్రీస్ ఆఫీసర్ అశోక్ కుమార్, డాక్టర్ మహేశ్వర ప్రసాద్, ఎ యల్ యస్ సి ఓ సురేంద్ర ప్రసాద్, ఆర్ అండ్ బి ఈఈ సునీల్ రెడ్డి, జైలు అధికారులు, లీగల్ ఎయిడ్ న్యాయవాది సులోచన ఖైదీలు పాల్గొన్నారు.

