పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడం మన అందరి బాధ్యత
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ లీగల్ సర్వీస్ యూనిట్ మెంబెర్ ఫర్ చిల్డ్రన్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి శ్రీ బి. లీలా వెంకట శేషాద్రి ఆదేశాల మేరకు నేడు బంగారుపేట మున్సిపల్ స్కూల్ నందు పిల్లల భద్రతపై అవగాహన కల్పించేందుకు గూడటచ్ బ్యాడ్ టచ్, పొక్సో యాక్ట్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లీగల్ సర్వీస్ యూనిట్ ఫర్ చిల్డ్రన్ మెంబర్ లయన్స్ క్లబ్ అఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి లయన్స్ జిల్లా గవర్నర్ అడ్వైసర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ పొక్సో చట్టం 18 సంవత్సరాల లోపు పిల్లలకు వర్తిస్తుందని చిన్నారులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 నెంబర్ కు సంప్రదించాలన్నారు. మున్సిపల్ ఆఫీస్ మేనేజర్ చిన్న వెంకట రాముడు మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల సమస్యలను స్నేహపూర్వకంగా అడిగి తెలుసుకుంటూ ఉండాలన్నారు. ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లయన్స్ క్లబ్ అఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ గౌరవాధ్యక్షులు మురారి శంకరప్ప మాట్లాడుతూ ప్రేమతో కూడిన స్పర్శ చెడు ఉద్దేశంతో కూడిన స్పర్శకు తేడాపై అవగాహన చిన్నారులకు కల్పించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. అనంతరం జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పాఠశాల చిన్నారులకు, మూడు అంగన్వాడీ పాఠశాలల చిన్నారులకు పళ్ళు, పాలు, పెన్నులు పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పి. ఎల్. వి కేజీ గంగాధర్ రెడ్డి, రిటైర్డ్ డిఎస్పి పాపారావు, రిటైర్డ్ తాసిల్దార్ జయన్న, లయన్స్ క్లబ్ అఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఉప కార్యదర్శి, లయన్ తిరుపతి సాయి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రఘు, అంగన్వాడీ కార్యకర్తలు కౌసల్య,మమతా తదితరులు పాల్గొన్నారు.

