డిప్యూటీ మేయర్ గా 12వ డివిజన్ కార్పొరేటర్ కర్రీ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నిక
1 min read

అభినందించిన పలువురు కార్పొరేటర్లు, కార్పొరేషన్ సిబ్బంది, మిత్రులు శ్రేయోభిలాషులు
అభినందించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి,మేయర్ నూర్జహాన్ పెదబాబు
ఈ పదవి నాలో బాధ్యత మరింత పెంచింది,
సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తా
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా 12వ డివిజన్ కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో డిప్యూటి మేయర్ ఎన్నికను నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటి మేయర్ పదవికి 12వ డివిజన్ కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు అభ్యర్ధిత్వాన్ని మాజీ డిప్యూటి మేయర్, 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు ప్రతిపాదించగా కార్పొరేషన్ విప్, 28వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల అరుణ బలపరిచారు. ఈక్రమంలో కర్రి శ్రీనివాసరావు డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల ప్రత్యేక అధికారి, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ వి. విశ్వేశ్వరరావు ప్రకటించారు. అనంతరం ఆయనకి ఎక్స్ అఫీషియో మెంబర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ షేక్ నూర్జహాన్లతో కలిసి ప్రత్యేక అధికారి విశ్వేశ్వరరావు దృవీకరణ పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన కర్రి శ్రీనివాసరావుకు అభినందనలు వెల్లువెత్తాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బడేటి చంటి, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్ధసారధి, డిప్యూటీ మేయర్ వందనాల దుర్గాభవానీ, కార్పొరేటర్లు, కూటమి నాయకులు తదితరులు కర్రి శ్రీనివాస్‌ను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు స్నేహితులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు శ్రీనివాస్‌కు పూలమాలలు వేసి శాలువాలు కప్పి అభినందించారు. నగర మేయర్ నూర్జహాన్ మాట్లాడుతూ నగరాభివృద్ధిలో డిప్యూటి మేయర్ కర్రి శ్రీనివాస్ ప్రభావవంతంగా పనిచేయాలని, ఎమ్మెల్యే బడేటి చంటికి మరింత మంచిపేరు తీసుకువచ్చే విధంగా పనితీరును కనపర్చాలని ఆయన సూచించారు. డిప్యూటి మేయర్ కర్రి శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూర్జహాన్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇ డా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏయమ్ సి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎన్ఆర్ పెదబాబు, కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

