జిల్లాలో అన్నాక్యాంటీన్లకు నాణ్యమైన, రుచికరమైన ఆహరం అందించాలి
1 min read

నిరుపేదలు భుజించి సంతృప్తి పొందే విధంగా అన్నా క్యాంటీన్లులో ఆహారం ఉండాలి
జిల్లా కలెక్టర్ కె.వెట్రీ సెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దెందులూరులో అక్షయపాత్ర ఆహరం తయారు చేసే కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీలు చేసి నిర్వహకులకు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెవ్వి పలు ఆదేశాలు జారీ చేశారు.దెందులూరు మండలం దెందులూరు టిటిడి కళ్యాణ మండపం దగ్గర గురువారం అక్షయపాత్ర ఆకస్మికంగా తనిఖీలు చేసి, మేనేజరు, పదార్థాలు తయారు చేసే పని వాళ్ళకు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెవ్వి దిశానిర్దేశం చేశారు.జిల్లాలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, తణుకు, నిడదవోలు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం మొత్తం 15 అన్నా క్యాంటీన్లుకు మూడు పూటలు ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నామని జిల్లా కలెక్టరుకు అక్షయపాత్ర మేనేజరు వై.రాజా వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెవ్వి మాట్లాడుతూ అన్నాక్యాంటీన్లు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు కేవలం రూ 5 లకే నాణ్యతతో రుచికరమైన భోజనమును ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదన్నారు. అన్నా క్యాంటీన్లుకు ఆహార పదార్థాలు సరఫరా చేసే అక్షయపాత్ర ఆహార తయారీ కేంద్రంలోని వాష్ ఏరియా, సర్వింగు ఏరియా, త్రాగునీరు, భోజన పదార్థాలు తయారు చేసే విధానం, పాత్రలు, మిషనరీలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఆహారం తయారు చేసేవారు విధిగా చేతులకు గ్లవుజులు , హెడ్ క్యాఫ్ లు ధరించాలన్నారు. పదార్థాలు తయారు చేసే బియ్యం, కూరగాయలు, నిత్యవసర సరుకులు తాజాగా ఉండి నాణ్యతతో ఉండాలని, వేడివేడి ఆహార పదార్థాలు నిర్ణీత సమయంలోగా అన్నా క్యాంటీన్లు పంపించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని, ప్రజలకు సకాలంలో నాణ్యమైన భోజనం అందించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టరు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దారు ఏ. శ్రీనివాస రావు, డిప్యూటీ యంపిడివో బి.ఆశీర్వాదం, యంపిడివో కార్యాలయ ఏవో యం.భీమరాజు, అక్షయపాత్ర మేనేజరు వై రాజా, గ్రామ పంచాయతీ కార్యదర్శి యన్.గాయత్రీదేవి, అక్షయపాత్ర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

