NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థితికి ఎదగాలి  

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ:  విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థితికి ఎదగాలని మైత్రి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఎస్ రామ్మోహన్ ఆకాంక్షించారు. గురువారం పత్తికొండ మండలం పుచ్చకాయల మడ గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో విద్యార్థులకు కేపిఆర్ మైత్రి  ఛారిటబుల్ ట్రస్టు సౌజన్యంతో ద్వారా  పరీక్ష అట్టలు , జ్యామెట్రి బాక్స్, పెన్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక తహసిల్దార్ హుస్సేన్ హాజరై విద్యార్థులకు సూచనలు సలహాలు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సరోజమ్మ,  ఉపాధ్యాయులు  సుధాకర్ గుప్త , రాజపుత్రుడు, రంజాన్, షరీఫ్ , జయంత్ కుమార్, చంద్రకళ ,  బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు గోరంట్ల, కరణం చంద్రన్న తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author