NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాఠశాలల్లో అవగాహన కల్పించిన ఎస్ఐ లు

1 min read

జూపాడుబంగ్లా..దామగట్ల’లో అవగాహన..

నందికొట్కూరు, న్యూస్​ నేడు: జూపాడుబంగ్లా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలోవిద్యార్థులకు గురువారం జూపాడుబంగ్లా ఎస్సై మల్లికార్జున అవగాహన కల్పించారు. అదేవిధంగా నందికొట్కూరు మండల పరిధిలోని దామగట్ల జిల్లా పరిషత్ పాఠశాలలో బ్రాహ్మణ కొట్కూరు ఎస్సై వి మణికంఠ విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐలు విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జుపాడుబంగ్లా కేజీబీవీలో ఎస్సై మల్లికార్జున  మాట్లాడుతూ విద్య యొక్క ప్రాముఖ్యత,బాల్య వివాహాల నివారణ,పోక్సో చట్టం,సైబర్ నేరాలు,రోడ్డు ప్రమాదాల నివారణ మరియు మహిళల, చిన్నపిల్లల భద్రతా జాగ్రత్తలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాల గురించి వివరించారు అదేవిధంగా పాఠశాల ఆవరణంలో 9 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఎస్సై తెలిపారు.దామగట్ల జిల్లా పరిషత్ లోఎస్సై మణికంఠ మాట్లాడుతూవిద్యార్థులకు ఏమైనా సమస్య వస్తే హెల్ప్ లైన్ నెంబర్ 112 కు ఫోన్ చేయాలని ఫోక్సో కేసు మహిళల సంరక్షణ మరియు సైబర్ క్రైమ్,మాదిక ద్రవ్యాల నష్ట నివారణ,ర్యాగింగ్ మరియు విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని అనుమానాస్పద,చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి ఉపాధ్యాయులకు లేదా పోలీసులకు తెలియజేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author