NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

” బాల్య వివాహల అనర్థాలపై అవగాహన ”    

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు కర్నూలు,జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి మంగళవారం 03-03-2026 న స్థానిక జిల్లా న్యాయసేవా అధికార సంస్థ నందు ప్యానల్ న్యాయవాదులకు ప్యారా లీగల్ వాలెంటీర్స్ కు,పిల్లల రక్షణ కోసం పనిచేసే యన్ జి ఓ స్ కు బాల్య వివాహా నిర్ములన పై అవగాహన సదస్సు నిర్వహించారు.   100 రోజుల బాల్య వివాహ రహిత భారత్ కార్యక్రమ ము లో భాగముగా బచ్పన్ బచావో ఆందోళన్ ఎన్జీవో మౌనిక వారి సహకారంతో ఏర్పాటు చేసిన బాల్య వివాహ విముక్తి భారత్ అనే ప్రచార రధాన్నీ జెండా ఊపి ప్రారంభించారు. జడ్జి మాట్లాడుతూ ఈ ప్రచార రధం జిల్లాలోని బాల్య వివాహాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు బాల్య  వివాహాల వల్ల జరిగే అనర్థాలపై అవగాహన  కల్పిస్తుందని తెలిపారుబాల్య వివాహ నిర్మూలన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు , బచ్పన్ బచావో ఆందోళన్ ఎన్జీవో మౌనిక, న్యాయవాది బాలాజీ,ప్యానల్ న్యాయవాదులు మరియు ప్యారా లీగల్ వాలంటీర్లు   పాల్గొన్నారు.

About Author