అంతర్జాతీయ మహిళా దినాన్ని సమున్నతంగా పాటించండి!
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: మార్చి 8 వ తేదీ అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా, AIMSS (అఖిలభారత మహిళ సాంస్కృతిక సంఘం) ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 10 గంటలకు టి.జి.వి కళాక్షేత్రం లోని మినీ హాల్ నందు మహిళా కాన్వెంషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో AIMSS రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కార్య వర్గ సభ్యులు శ్రీమతి లక్ష్మీ సింగ్ ముఖ్య ఉపన్యాసకులుగా హాజరై. మార్చ్ 8 వ తేదీ అంతర్జాతీయ మహిళా దినాన్ని, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలోని చైతన్యవంతమైన మహిళలు పోరాట స్ఫూర్తితో పాటిస్తారు. తమ న్యాయమైన హక్కుల కోసం చేసిన పోరాటాలను, విజయాలను స్మరించుకొంటారు. అంతిమ విముక్తికై జరిగే పోరాటంలో ఎంత పురోగతి సాధించారో బేరీజు వేసుకొంటారు. భవిష్యత్తు పోరాటాలకు ప్రతిజ్ఞ పూని సన్నద్ధమయ్యే చారిత్రక దినంగా ఈరోజును పరిగణిస్తారు. కావున నేడు సమాజంలో నెలకొని ఉన్న అసమానతలు, దాడులను అరికట్టుటకై మహిళా లోకం ఐక్యం కావాల్సిన తరునంఇది. మహిళలు ఐక్యంగా ఉద్యమించినప్పుడు మాత్రమే వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి నోచుకోగలవని అన్నారు. AIMSS రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి తేజోవతి మాట్లాడుతూ భారతదేశంలోని సంఘసంస్కర్తల పోరాట ఫలితమే నేడు మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు. అయినప్పటికీ మహిళలను చూసే దృక్పథంలో మార్పు రాలేదు, వారి పోరాట స్ఫూర్తితోనే దీనిని కూడా రూపుమాపాలన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి ప్రియాంక అధ్యక్ష వహించగా ఇతర మహిళలు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పురోగతి, మహిళలు, ఫలితమే,

