కందులూరు పాఠశాలకు బెంచీలు .. సౌండ్ సిస్టం పంపిణీ
1 min read

కందులూరు, న్యూస్ నేడు : విజయ బ్యాంక్ వర్కర్స్ ఆర్గనైజేషన్ తరపున టంగుటూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కందులూరునకు లక్ష రూపాయల విలువైన15 విద్యార్థుల బెంచీలు మరియు సౌండ్ సిస్టం ను అందించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బందికి ఏర్పాటు చేయబడిన కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా రీజనల్ మేనేజర్ యస్. కృపాకిరణ్ రెడ్డి మరియు వీబీడబ్ల్యుఓ ట్రస్టీలు శ్రీ ఆంజనేయులు, పసుమర్తి సుబ్బారావు, స్థానిక బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ శ్రీ జగదీష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జి సుబ్బారావు మాట్లాడుతూ ఈ సంవత్సరమే పాఠశాల ఉన్నత పాఠశాల గా అప్గ్రేడ్ అయిందని పాఠశాలకు గ్రామ పెద్దలు బాగా సహకరిస్తున్నారని అందులో భాగంగా శ్రీ పసుమర్తి సుబ్బారావు ని వారి అసోసియేషన్ తరపున లక్ష రూపాయల విలువైన15 బెంచీలు మరియు సౌండ్ సిస్టం అందించడం చాలా సంతోషమని విద్యార్థులకు విద్యాబోధన చేయడానికి మా సాయి శక్తుల కృషి చేస్తామని చెప్పారు . రీజినల్ మేనేజర్ ఎస్.కృపా కిరణ్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల వాతావరణం చాలా బాగుందని విద్యార్థుల యొక్క అభివృద్ధికి పాఠశాల సిబ్బంది కృషి అభినందనీయమని అన్నారు. మరొక ట్రస్టీ పెసర్లంక ఆంజనేయులు . మాట్లాడుతూ విద్యార్థులకు సమాజానికి చేతనంత చేతనైనంత సహకారం అందించడానికి ఈ సంస్థను స్థాపించామని సంస్థ తరఫున సమాజానికి అవసరమైన సహకారం అందిస్తామన్నారు. స్థానిక బ్యాంక్ మేనేజర్ యం. జగదీష్ మాట్లాడుతూ పాఠశాలను ఎప్పుడు గమనిస్తుంటానని, విద్యార్థులు మంచి నడవడికతో ఉన్నారని, పాఠశాలలో ఎక్స్ట్రా క్లాసులు నిర్వహించడం గమనించానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉప్పలపాటి రామరాజు, దామచర్ల బసవయ్య, రామిశెట్టి దాసయ్య, మన్నం వెంకయ్య , పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కె.వి రజిని, వైస్ చైర్మన్ పి. వెంకటేశ్వర్లు పాఠశాల సిబ్బంది పీ కృష్ణారెడ్డి. సిహెచ్ శ్రావణ్ కుమార్,పి .రవిశంకర్, కె . భాస్కర్ , పి . వెంకటేశ్వర్లుటి .పద్మావతి , వి .విజయలక్ష్మి , మాధవి సుందరి, కె.వసుంధర ,బి . సుభాషిని తదితరులు పాల్గొన్నారు ఘనంగా సత్కరించారు.


