జాస్తి హరినాథ్ బాబు బృందావన్ పార్క్ లో మహిళా దినోత్సవ వేడుకలు
1 min read

స్వశక్తితో జీవనం సాగిస్తున్న ఇద్దరు మహిళలకు ఘన సత్కారం సన్మానం
పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం
పలువురికి కృతజ్ఞతలు తెలియజేసిన మహిళలు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జాస్తి హరినాథ్ బాబు బృందావనం పార్క్ వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను స్థానిక పత్తేబాద బృందావన్ పార్కులో ఆదివారం అసోసియేషన్ అధ్యక్ష , కార్యదర్శులు మరక భుజంగరావు,పోతన మురళీకృష్ణ , సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబం కోసం నిరంతర శ్రమ తో మహిళాలు స్వయంకృషితో శక్తి చాటిన మహిళ ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న చోదిమెళ్ళ ఆదిలక్ష్మి మరియు రైతు బజార్ లో కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబ పోషణ చేసుకుంటున్న శ్రీకాకుళం సువార్త కి బృందావనం పార్క్ వాకర్స్ అసోసియేషన్ సంఘ సభ్యులు స్వసక్తితో జీవనం సాగిస్తున్న వారి ఇరువురిని ఘనంగా శాలువాలు కప్పి,పూల బొక్కలు అందించి,మెమోటోలు అందజేసి బట్టలు మరియు ఫ్రూట్స్ తో వారిని ఘనంగా.సత్కరించు కోవడం జరిగిoది.పొట్టి శ్రీరాములు రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ ఎల్. వినోద్ బాబు మాట్లాడుతూ కుటుంబ పోషణలో నిరాధారణకు గురైన మహిళలకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఏలూరు టౌన్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ లీలా కృష్ణ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుంటున్నారని ఆటో డ్రైవింగ్ లో ఆసక్తిగల మహిళలు ముందుకు వస్తే బ్యాంకుల సహకారంతో యూనియన్ ద్వారా బ్యాటరీ ఆటోలు అందించేందుకు తమ వంతు సహకారంతో అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మామిళ్ళ రాఘవేంద్రరావు, కోశాధికారి దుర్గాప్రసాద్ (పివిఎన్ వి) కార్యదర్శులు ఉక్కుర్తి రాంబాబు, జాలి వాకర్స్ ఎస్ కె.సత్యనారాయణ, గౌరవ సలహాదారుగా అడబాల లక్ష్మి , డైరెక్టర్స్ నూకల తిరుమలరావు,మజ్జి రాజేంద్రప్రసాద్,మజ్జి శ్రీనివాసరావు, మరకా శివయ్య , చుక్క నరసింహారావు,కొల్లా సత్యవతి,బొడ్డు రమణకుమారి విజయలక్ష్మి మరియు 150 మంది పైగా వాకర్స్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిoది. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. వాకర్స్ అసోసియేషన్ సంఘ సభ్యులు ఏర్పాటుచేసిన అల్పాహారాన్ని పలువురు సంఘ సభ్యులు కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందించారు.


