NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యావ్యాప్తి కోసం కృషి చేసిన సంఘ సంస్కర్త సావిత్రి బాయి పూలే

1 min read

హోలగుంద న్యూస్ నేడు : సమాజంలో అసమానతల మీద ఆలుపెరుగని పోరాటంచేసి, అణగారిన వర్గాల్లో విద్యావ్యాప్తి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రి బాయి పూలే .ఈ కార్యక్రమం లో దళిత సీనియర్ నాయకులు, జర్నలిస్ట్ H చలపతి  మాట్లాడుతూ ఆనాడు సమాజంలో అమ్మ సావిత్రి బాయి పూలే మీద రాళ్ళు విసిరిన, బురద చెల్లినా ఆ తల్లి వాటిన్నింటిని భరించి… అణగారిన వర్గాల బిడ్డలకు, మహిళకు అక్షర జ్ఞానాన్ని అందించి మన బతుకుల్లో వెలుగులు నింపిన త్యాగమాయి. నేడు ఆమె వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావురాలి ను స్మరించుకుంటూ ఆ తల్లి ఆశయ సాధనకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ, వారికి ఘనంగా భారత్ పెట్రోలియం దగ్గర గౌరవనీయులు దళిత జాతి సీనియర్ నాయకులు చిన్నహ్యట శేషగిరి ఆధ్వర్యంలో ఘనంగా అమ్మ సావిత్రిబాయి పూలే  చిత్ర పటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ వాల్మీకి ముద్దు బిడ్డ హెల్త్ ఆఫీసర్ చంద్రశేఖర్ నాయుడు,  మరియు ఎం. రంగన్న  దళిత జాతి ముద్దు బిడ్డ సీనియర్ నాయకుడు జర్నలిస్ట్  హెచ్​. చలపతి  హెల్త్ నాగరాజు, జేరుబండి నాగరాజు, దళిత యువ నాయకులు హనుమంతు, మూర్తింజయ, మల్లి, మూర్తి మార్లమడికి భాస్కర్, ఎర్రిస్వామి, గోవిందు రాజు,కృష్ణ, చిదానంద,సురేష్ వరాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Author