శ్రీ మారెమ్మ దేవి, శ్రీ సుంకులమ్మ దేవి దర్శనం చేసిన ఎమ్మెల్యే
1 min read

ఆలూరు న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం హాలహర్విమండలం మాచానూరు గ్రామంలో నిర్వహించిన శ్రీ మారెమ్మ దేవి, శ్రీ సుంకులమ్మ దేవి వారి ఊరుదేవర మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరుపాక్షి ఆలయానికి చేరుకుని శ్రీ మారెమ్మ దేవి, శ్రీ సుంకులమ్మ దేవి వారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.గ్రామంలో జరుగుతున్న ఈ సంప్రదాయ ఉత్సవం గ్రామ ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామ దేవతల ఆశీస్సులతో ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

