NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు జిల్లాలో ఉపాధ్యాయుల మదింపు పై రెండు రోజుల వర్క్‌షాప్ ముగింపు

1 min read

26 మండలాల నుండి ఉపాధ్యాయుల పాల్గొనడం – విద్యార్థుల అభ్యాస సామర్థ్యాల మెరుగుదలే లక్ష్యం

కర్నూలు,  న్యూస్​ నేడు: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని బలోపేతం చేయడం మరియు మదింపు విధానాలను సమర్థవంతంగా అమలు చేయడం లక్ష్యంగా కర్నూలు జిల్లాలో రెండు రోజుల వర్క్‌షాప్ జరిగినది. కర్నూలులోని సిల్వర్  జూబ్లీ కాలేజీలో ఈ కార్యక్రమం నిర్వహించ బడింది.జిల్లాలోని 26 మండలాల నుండి ప్రతి మండలం నుంచి ఇద్దరు ఎంఈఓలు, ఇద్దరు సీఆర్‌సీ హెడ్‌మాస్టర్లు, ఇద్దరు ఎస్జీటీలు మరియు ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు చొప్పున మొత్తం 8 మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ విద్యా విధానం (NEP)–2020 ప్రకారం విద్యార్థుల మదింపు ప్రమాణాలను మెరుగుపరచడం మరియు ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ అందించడం ఈ వర్క్‌షాప్ ముఖ్య ఉద్దేశ్యం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి L. సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థుల అభ్యసనంలో ఉన్న లోపాలను గుర్తించి వాటికి తగిన పరిష్కారాలను కనుగొనే విధంగా ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు, , మాస్టర్ ట్రైనర్లు విజయ భాస్కర్,వినోద్ , వెంకట రెడ్డి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author