NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నగర ప్రగతికి పాటు పడ్డాం..!

1 min read

ఐదేళ్లలో అనేక మార్పులను తీసుకొచ్చాం

పౌరులుగా అభివృద్ధికి సహకారం కొనసాగిస్తాం

ముగిసిన పాలకవర్గ తుది సర్వసభ్య సమావేశం

సభ్యులకు సత్కారం, విందు, బ్యాగు కానుకలు

2026-27 బడ్జెట్‌కు ఆమోద ముద్ర

72 అజెండాలకు గ్రీన్ సిగ్నల్

కర్నూలు, న్యూస్​ నేడు: గురువారం  నగర ప్రగతికి గడిచిన ఐదేళ్లుగా ఎంతగానో పాటు పడ్డామని, మున్ముందు సైతం నగరాభివృద్ధికి పౌరులుగా తమ వంతు సహకారం కొనసాగిస్తామని మేయర్ బి.వై. రామయ్య, కార్పొరేటర్లు ఉద్ఘాటించారు. గురువారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో మేయర్ అధ్యక్షతన తుది సర్వసభ్య సమావేశం నిర్వహించారు. చివరి సమావేశం కావడంతో మేయర్, డిప్యూటీ మేయర్లు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లకు అలాగే ప్రస్తుత పాలకవర్గం సభ్యులు ఎన్నికై అనారోగ్య కారణాలతో మృతి చెందిన గిప్సన్, అనివార్య కారణాలతో పదవి కోల్పోయిన కాశిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులకు జ్ఞాపిక, బ్యాగును కమిషనర్ పి.విశ్వనాథ్ అందించారు. అలాగే పాలకవర్గ సభ్యులు, అధికారులు, పాత్రికేయులు విందు భోజనం ఆరగించారు.తొలుత 2026-27వ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించారు. అనంతరం 72 అజెండా తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీధీ దీపాలు, ఆక్రమణలు, వెండర్ జోన్లు, ట్రేడ్ లైసెన్స్ వంటి అంశాలపై చర్చించారు.సమావేశంలో డిప్యూటీ మేయర్లు సిద్దారెడ్డి రేణుక, నాయకల్లు అరుణ, అదనపు కమిషనర్ ఆర్‌జి‌వి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, మేనేజర్ చిన్నరాముడు, ఎస్‌ఈ రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి నాగ ప్రసాద్ బాబు, ఇంచార్జీ సిటి ప్లానర్,‌ ఆర్‌ఓ జునైద్, వివిధ శాఖాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author