NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కన్స్యూమర్ రైట్స్ పైన అవగాహనా గోడ పత్రికలను ఆవిష్కరించిన జేసీ

1 min read

కర్నూలు,న్యూస్​ నేడు: ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడానికి లయన్స్ క్లబ్ అఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, యునైటెడ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అండ్ లీగల్ రైట్స్ ఫౌండేషన్, నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ అఫ్ ఇండియా ల సంయుక్త ఆధ్వర్యంలో  లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ ఛాంబర్  నందు  జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్  ఐఏఎస్ సమక్షంలో కన్స్యూమర్ రైట్స్ పైన అవగాహనా గోడ పత్రికలను ఆవిష్కరించారు.లయన్స్ క్లబ్ అఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి, యునైటెడ్ కన్స్యూమర్ రైట్స్ అండ్ లీగల్ రైట్స్ ఫౌండేషన్ ఏపీ స్టేట్ చైర్మన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ అఫ్ ఇండియా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూవినియోగదారులు తమ హక్కులను తెలుసుకొని వినియోగించుకోవాలనిప్రతి వ్యక్తి జాగ్రత్తగా కొనుగోలు చేయడం ద్వారా మోసాలను నివారించవచ్చునని,సురక్షితమైన మరియు న్యాయమైన మార్కెట్ కోసం అందరూ కలిసి పనిచేయాలన్నారు. అనంతరం ఈనెల 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జూనియర్స్ విభాగంలో జరిగిన వ్యాస రచనపోటీలలో గెలుపొందిన ఎండీ. అతీక్ అహ్మద్ కు మెమెంటో సర్టిఫికెట్ ను అందజేశారు.

About Author