NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారుల పనితీరు ప్రశంసనీయం

1 min read

ఏపీఎంపీఏ రాష్ట్ర అధ్యక్షుడు వీర్ల శ్రీరామ్ యాదవ్ అభినందనలు

విజయవాడ, న్యూస్​ నేడు : ఎన్టీఆర్ జిల్లాలో జర్నలిస్టులందరికీ మీడియా అక్రిడిటేషన్స్ అందించడంలో జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారుల పనితీరు ప్రశంసనీయమని ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ (ఏపీఎంపీఏ) రాష్ట్ర అధ్యక్షుడు వీర్ల శ్రీరామ్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలోని గవర్నర్‌పేట ప్రాంతంలో ఉన్న జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో  సీనియర్ జర్నలిస్ట్, ఎన్టీఆర్ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు యేమినేని వెంకటరమణ ఆధ్వర్యంలో విజయవాడ నగర అధ్యక్షుడు తాళ్లూరు అనిల్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. అనంతరం ఈ సందర్భంగా ఏపీఎంపీఏ రాష్ట్ర  కార్యదర్శి పసుపులేటి చైతన్య, విజయవాడ నగర ఉపాధ్యక్షుడు వేల్పుల ప్రశాంత్,  కోట రాజా తదితరులు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారులను కలిసి దుశాలువాతో సన్మానించారు. జర్నలిస్టుల పట్ల అధికారులు చూపిన సానుకూల దృక్పథం, పారదర్శక విధానాన్ని ప్రశంసిస్తూ సంఘం నాయకులు తమ కృతజ్ఞతలు తెలిపారు. వీర్ల శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ, జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అందజేయడం అనేది కేవలం పరిపాలనా ప్రక్రియ మాత్రమే కాకుండా, మీడియా రంగానికి ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహం   అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఈ ప్రక్రియను వేగవంతంగా, నిష్పక్షపాతంగా అమలు చేయడంలో జిల్లా కలెక్టర్ లక్ష్మిషా పర్యవేక్షణలో జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారులు కీలక పాత్ర పోషించారని ఆయన ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా డిపిఆర్‌ఓ రమణ, డివిజనల్ పి.ఆర్.ఓ.రవి,మరియు ప్రసాద్ తదితర అధికారులు జర్నలిస్టులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, ప్రతి అంశాన్ని సమగ్రంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరి వర్కింగ్ జర్నలిస్ట్ కు అక్రిడిటేషన్ అందేలా చర్యలు తీసుకోవడం అభినందనీయం కమిటీ సభ్యు యేమినేని వెంకట రమణ పేర్కొన్నారు. అలాగే జర్నలిస్టులు సమాజానికి అద్దం పట్టే వర్గమని, వారి పనితీరుకు సరైన గుర్తింపు లభించడం అవసరమని ఆయన అన్నారు. అక్రిడిటేషన్ కార్డుల ద్వారా జర్నలిస్టులకు అధికారిక గుర్తింపు లభించడంతో పాటు వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలుగుతుందని, సమాచార సేకరణలో సౌలభ్యం పెరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారులు మాట్లాడుతూ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిషా మార్గదర్శకత్వంలో ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించామని తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులు జర్నలిస్టు సంఘాల సభ్యులతో పలుమార్లు చర్చలు జరిపి, అర్హత ప్రమాణాలను స్పష్టంగా నిర్ధారించి, ప్రతి అర్హుడైన జర్నలిస్టుకి అక్రిడిటేషన్ అందేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో పారదర్శకతను పాటించడం, ఎటువంటి వివక్ష లేకుండా వ్యవహరించడం తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో, వారి వృత్తి అభివృద్ధికి సహకరించడంలో జిల్లా పౌర సంబంధాల శాఖ ఎల్లప్పుడూ ముందుండుతుందని అధికారులు హామీ ఇచ్చారు. జర్నలిస్టులు మరియు ప్రభుత్వ యంత్రాంగం మధ్య పరస్పర అవగాహన, సహకారం పెరిగితే సమాజానికి మరింత నాణ్యమైన సమాచారాన్ని అందించగలమని వారు అభిప్రాయపడ్డారు. మొత్తంగా, ఎన్టీఆర్ జిల్లాలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ప్రభుత్వం, అధికారులు మరియు మీడియా వర్గాల మధ్య మంచి అనుబంధం నెలకొన్నదని ఈ కార్యక్రమం స్పష్టం చేసింది. ఇది భవిష్యత్తులో కూడా మీడియా-ప్రభుత్వ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగుగా భావించవచ్చు.

About Author