NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా పంపిణీ

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్యాపిలి పట్టణంలో దాదాపు 100 మంది ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫాలను ముస్లిం మైనారిటీ నాయకులు ఖాజా ఫీర్ గృహము నందు  డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా రంజాన్ తోఫాను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ, రంజాన్ మాసం త్యాగం, దానం, సానుభూతి వంటి గొప్ప విలువలను మనకు నేర్పించే పవిత్రమైన కాలమని  పేర్కొన్నారు. పేద మరియు అవసరమైన కుటుంబాలకు తోడ్పాటు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ముస్లిం సోదరీమణులకు అందజేసిన ఈ తోఫాలు వారికి కొంతమేర ఉపశమనం కలిగిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరావు యాదవ్, తేదీన మండల ఇన్చార్జి ఎద్దుల దొడ్డి ప్రభాకర్ రెడ్డి,మాజీ ఎంపీపీ టి శ్రీనివాసులు, తేదేపా మండల కన్వీనర్ సుదర్శన్, పట్టణ కన్వీనర్ కొంగనపల్లి మధు, తేదేపా జనరల్ సెక్రెటరీ నడిగడ్డ నాగేంద్ర, తేదేపా నాయకులు పెద్ద పూజర్ల ప్రసాద్ రెడ్డి,గోల్ల రామ్మోహన్ యాదవ్, ప్రిన్సిపాల్ మధు,ఎస్ కే వలి,సుభన్ , మత్తు బాబా సాహెబ్,గుండల చంద్రశేఖర్, పుల్లయ్య, చల్లా వీరాంజనేయులు, బాలకృష్ణ తదితరులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author