ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత
1 min read

ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారు వెల్లడి
దూర ప్రాంతాల నుండి వచ్చిన
వారికి శ్రీ సత్య సాయిబాబా ట్రస్ట్ ద్వారా ఉచితభోజన సదుపాయం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రజల ఫిర్యాదు లను త్వరితగతిన, పారదర్శకమైన పద్ధతి లో పరిష్కరించడమే లక్ష్యంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాల యంలో సోమవారం ప్రజా సమస్యల పరి ష్కార వేదిక’ కార్య క్రమం నిర్వహించిన కార్యక్రమములో ఏలూ రు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీ ఎస్ గారు స్వయంగా బాధితుల నుండి అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసు కున్నారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ ఎన్. సూర్య చంద్ర రావు గారు పాల్గొని ఫిర్యాదుదారులతో మాట్లాడారు.ఈ ప్రక్రియ అంతా పేపర్ లెస్ పద్ధతిలో పూర్తి పారదర్శకమైన ఆన్లైన్ విధానంలో సాగింది.నేడు అందిన ఫిర్యాదులలో అధికంగా భూ వివాదాలు, కుటుంబ కలహాలు మరియు ఆర్థిక మోసా లకు సంబంధించినవి ఉన్నాయి. ఈ రోజు అందిన మొత్తం పిర్యాదులు 43 వీటిపై చట్ట ప్రకారం తక్షణమే విచారణ చేపట్టి, నివేది కలు సమర్పించాలని సంబంధిత పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ లో మాటలాడి ఆదేశాలు ఇచ్చినారు.
ప్రజలకు ఎస్పీ సూచనలు & వెసులుబాటులు
ప్రజలు తమ సమ స్యల కోసం జిల్లా కార్యాల యం వరకు వచ్చి సమయం, డబ్బు వృథా చేసుకోకుండా ఈ క్రింది మార్గాలను ఉప యోగించుకోవాలని ఎస్పీ సూచిం చారు. స్థానిక కార్యా లయాలు సబ్-డివిజన్, లేదా సర్కిల్ కార్యా లయాల్లో నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. లేదా ఆన్లైన్ ఫిర్యాదు meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులను నమోదు చేయవచ్చని తెలిపారు.ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకోవడానికి 1100 టోల్-ఫ్రీ నెంబర్కు కాల్ చేయవచ్చన్నారు. దూర ప్రాంతాల నుండి ఫిర్యాదుల కోసం పోలీస్ కార్యాల యానికి వచ్చిన సామాన్య ప్రజల సౌకర్యార్థం శ్రీ సత్యసాయి బాబా ట్రస్ట్ వారు ఉచిత భోజన సదుపాయం కల్పించారు.

