గండికి కారణం.. ఇంజినీర్లు,కాంట్రాక్టర్లే
1 min read

మద్దిగుండం చెరువు పనులు త్వరగా పూర్తి చేయాలి
పనులను పరిశీలించిన ఎమ్మెల్యే..
న్యూస్ నేడు మిడుతూరు (నందికొట్కూరు): జలకనూరు మద్దిగుండం చెరువు గండికి కాంట్రాక్టర్లు,ఇంజినీర్లే కారణమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోనిజలకనూరు మద్దిగుండం చెరువులో జరుగుతున్న పనులను రైతులతో బుధవారం ఎమ్మెల్యే గిత్త జయసూర్య పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గండి మరమ్మతు పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం నుండి 30 లక్షలు నిధులు మంజూరు అయ్యాయి.గత పది రోజుల నుండి ఈ పనులు జరుగుతున్నాయి.ఈ పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.మొదటగా ఇక్కడ రింగ్ బండ్ వేయించాలనుకుంటే అది ఉండదని చెప్పడంతో ఎస్టిమేషన్ మార్చాల్సి వచ్చిందన్నారు.780 కిలో మీటర్ల వరకు హెచ్ఎన్ఎస్ఎస్ నుండి నీళ్లు తీసుకువెళ్తున్నామని అదేవిధంగా కలమంద లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ త్వరలో పూర్తి చేస్తామని వీటివల్ల రైతులకు తాగు, సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు.మద్దిగుండం చెరువులో నల్లమట్టి వేస్తూ ఉండటం వల్ల నాణ్యతగా ఉండదని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఎమ్మెల్యే అధికారులను అడగ్గా వాటిని ల్యాబ్ కు పంపించగా మట్టి వేయడం వల్ల ఏమీ ఇబ్బంది ఉండదని అధికారులు సమాధానం ఇచ్చారు.ఆ రిపోర్టు నాకు ఇవ్వాలనిఎమ్మెల్యే అధికారులను అడిగారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,సర్పంచ్ కురువ ఎల్లయ్య,గుండం శివరామి రెడ్డి,వెంకటేశ్వర్ రెడ్డి,సుధాకర్ రెడ్డి,యూనిట్ ఇంచార్జ్ సంపంగి రవీంద్రబాబు,నరసింహ గౌడ్, శబ్బు అధికారులు పాల్గొన్నారు.

