NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోగులకు నాణ్యమైన, వేగవంతంగా వైద్య సేవలందించాలి

1 min read

ఓపీ కౌంటర్ లు అదనంగా ఏర్పాటు చేయండి

ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవల పై సంతృప్తి వ్యక్తం చేసిన పేషెంట్ లు

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు, న్యూస్​ నేడు : ఆస్పత్రుల్లో రోగులకు నాణ్యమైన, వేగవంతంగా వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి వైద్యాధికారులను ఆదేశించారు.బుధవారం ఆదోని లో ప్రభుత్వ సర్వజన వైద్యశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఓపీ, ఆర్థో, సర్జికల్, ఫార్మసీ, మేల్, ఫీమేల్ మెడికల్ వార్డు, టెలీ రేడియాలజీ, ఆపరేషన్ థియేటర్ తదితర విభాగాలను  కలెక్టర్ పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి ఆరా తీశారు.ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న  మెహబూబ్ బీ  అనే పేషెంట్ తో మాట్లాడుతూ డాక్టర్లు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందిస్తున్నారా? మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారా? అని ఆరా తీశారు.. పేషెంట్ మాట్లాడుతూ బయట ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులతో పోలిస్తే ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండి ట్రీట్మెంట్ చాలా బాగా అందిస్తున్నారని తెలిపారు.  అదే విధంగా భోజనం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, చాలా బాగా ఉందని తెలిపారు. ఇతర పేషంట్లతో కూడా కలెక్టర్ మాట్లాడి, వారి ఆరోగ్య విషయాలను గురించి తెలుసుకున్నారు.వైద్యుల పర్యవేక్షణ, మందుల పంపిణీ, భోజన సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేసిన రోగులుఅనంతరం కలెక్టర్ మీడియాతో  మాట్లాడుతూ ఆసుపత్రిలో ఓపి  చాలా ఎక్కువగా ఉందని, రోజుకు సుమారు 600 నుండి 700 మంది రోగులు వస్తున్నారన్నారు. ఆసుపత్రిలో వైద్యులు ఉన్నారు, స్టాఫ్ నర్సులు మరియు పారామెడికల్ సిబ్బంది కొంత కొరత ఉందన్నారు.కార్యక్రమంలో ఆదోని ఇంచార్జి సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, ఆదోని జీజీహెచ్ సూపరింటెండెంట్ నాగరాజు, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఏఓ సింధు సుబ్రమణ్యం, డి సి హెచ్ ఎస్ జఫ్రుల్లా, ఆదోని తహసిల్దార్ శేషపాణి, తదితరులు పాల్గొన్నారు.

About Author