NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమరావతి పార్టీ ప్రధాన కార్యాలయంలో క్లస్టర్ ఇంచార్జ్ శిక్షణల్లో ప్రిన్సిపాల్ మధు

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర క్లస్టర్ ఇన్చార్జిల రెండు రోజుల  శిక్షణ తరగతులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన అమరావతి కేంద్రంలోని మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులకు ప్యాపిలి పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రిన్సిపాల్ మధు హాజరయ్యి300 మంది మాజీ మినిస్టర్, ఎమ్మెల్యేలు ,చైర్మన్లు శిక్షణ కు ప్రజా ప్రతినిధుల సమీక్షలో డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రిన్సిపాల్ మధు అవకాశం లభించడం ప్యాపిలి కూటమి నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తంచేశారు. అందులో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశానని తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తన వంతు కృషి ఏవిధంగా చేస్తున్నానొ వివరించానని పేర్కొన్నారు. రెండు రోజుల క్లస్టర్ ఇంచార్జిల  శిక్షణ తరగతులు లో మంత్రి నారా లోకేష్ క్యాడర్ పార్టీ బలోపేతం, పార్టీ నిర్మాణం, సంక్షేమ పథకాలు అమలు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం మొదలగు అంశాలపై  దిశా నిర్దేశం చేశారని తెలిపారు.

About Author