NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వల్పంగా పెరిగిన పంచాయతీ ఆదాయం

1 min read

హోళగుంద న్యూస్ నేడు; మండల కేంద్రమైన హోళగుంద లోని మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన ఆదాయ వనరులైన హోటల్ సైట్లు 1,2,3,4,5 మరియు వారపు సంత మార్కెట్,బస్టాండ్,సృజల స్రవంతిలకు సర్పంచ్ చలువాది రంగమ్మ అధ్యక్షతన డిప్యూటీ ఎంపీడీఓ చక్రవర్తి ఆధ్వర్యంలో పంచాయతీ అభివృద్ధి అధికారి రాజశేఖర్ బహిరంగ వేలం నిర్వహించడం జరిగిందని మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ అన్నారు ఈ సందర్భంగా శనివారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో వేలంపాటలు నిర్వహించారు ఈ వేలం పాటల్లో మొదటి హోటల్ ను దిడ్డి చిన్న మల్లయ్య 3 లక్షల 75 వేలు దక్కించున్నారు.రెండవ హోటల్ ను ముల్లా  నూర్జహాన్ 3 లక్షల 57 వేలకు దక్కించుకున్నారు.మూడవ హోటల్  ను దిడ్డి నాగప్ప 3 లక్షల 35 వేలకు దక్కించుకున్నారు.నాలుగవ హోటల్ ను వీరన్న గౌడ 3 లక్షల 68 వేలకు దక్కించుకున్నారు.ఐదవ హోటల్  చాకలి పార్వతి 2 లక్షల 81 వేలకు దక్కించుకున్నారని వారు తెలియజేశారు అలాగేసృజల స్రవంతి (వాటర్ ప్లాంట్) వీరన్న గౌడ 62 వేలకు దక్కించుకున్నారు.మరియు వారపు సంత మార్కెట్,బస్టాండ్ లను వాయిదా వేసినట్లు పంచాయతీ అభివృద్ధి అధికారి రాజశేఖర్ గౌడ్ తెలిపారు బస్టాండు మరియు వారపు సంత మార్కెట్  ఉన్నత అధికారులకు ఆదేశాల మేరకు త్వరలోనే వేలం పాటల నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు ఈ బహిరంగ వేలం పాటలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎస్సై దిలీప్ కుమార్ పోలీస్ బంద్  నిర్వహించారు.

About Author