బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నిక
1 min read

అధ్యక్షుడిగా శరభయ్య,ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వర్లు..
న్యూస్ నేడు నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా శరభయ్య మరియు ప్రధాన కార్యదర్శిగా లాయర్ బి.వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి సీనియర్ న్యాయవాది వెంకటరాముడు అన్నారు.శనివారం జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీలో ఎవరూ లేకపోవడంతో ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు ఆయన తెలిపారు.వీరితో పాటు ఉపాధ్యక్షులుగా బి.కేశాలు,జాయింట్ సెక్రటరీగా వి అరుణ్ కుమార్, మహిళా ప్రతినిధిగా విజయలక్ష్మి ఎన్నిక అయినట్లు వెంకట రాముడు తెలిపారు.వీరిని మిత్రులు శ్రేయోభిలాషులు శాలువా పూల మాలలతో ఘనంగా సత్కరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.


