పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేయడం కూటమీ ప్రభుత్వం లక్ష్యం
1 min read

శాసనసభ్యులు బోడే ప్రసాద్
పెనమలూరు, న్యూస్ నేడు: నియోజకవర్గం,తాడిగడప మున్సిపాలిటీ,తాడిగడప లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా కూటమి ప్రభుత్వం సహకారంతో నూతనంగా నిర్మించుకున్న గృహాన్ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూపేదవాడు సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడం ఆ కుటుంబానికి ఒక గొప్ప ఆనందకరమైన క్షణమని అన్నారు..రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వంలో పూర్తికాని ఇల్లు,కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి చేసిన ఇల్లును సామూహిక గృహప్రవేశం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.ముఖ్యంగా గత ప్రభుత్వంలో లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకొని 80 శాతం టిడ్కో ఇల్లును నిర్మించి వదిలేశారు.కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించి పూర్తి చేసే లబ్ధిదారులతో గృహప్రవేశం చేసి ఇంటి తాళాలు ఇచ్చామన్నారు.గత వైసిపి ప్రభుత్వం,గృహ,ధాన్యం, ఎన్ఆర్జిఎస్,జలజీవన్,ఇలా అన్ని వ్యవస్థల నిధులను ఇష్టానుసారంగా దుర్వినియోగం చేయడంతో కూటమి ప్రభుత్వంపై భారం పడిందన్నారు..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టుకుంటూ, ఒక్కొక్కటిగా అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నామన్నారు.సొంత భూమి కలిగిన లబ్ధిదారులకు,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రెండు లక్షల 40 వేలు లోనుని ఏప్రిల్ నెలలోఅందజేయబోతున్నామని పేర్కొన్నారు…ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ మరియు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పీత గోపీచంద్ రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ తాతపూడి గణేష్ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు సంగేపు రంగారావు మేడసాని రత్నకుమారి తుమ్మల రామకుమార్ నర్ర చంటి మత్రపు విశ్వ కూటమి నాయకులు,కార్యకర్తలు,అధికారులు,తదితరలు పాల్గొన్నారు.

