PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భరతుడికి స్వాగతం..

1 min read

సినిమా డెస్క్​ : మహాభారత గాథ ఆదిపర్వంలోని శకుంతల – దుష్యంతుడి ప్రేమ కథ ఆధారంగా క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం తెరకెక్కిస్తున్న పౌరాణిక ప్రేమగాధ ‘శాకుంతలం’. సమంత అక్కినేని – మలయాళ హీరో దేవ్ మోహన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కుమార్తె అర్హ తెరంగ్రేటం చేస్తోంది. ఈ చిత్రంలో ప్రిన్స్ భరత పాత్రలో అర్హ కనిపించనుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షెడ్యూల్‌లో అల్లు వారి గారాల పట్టి కూడా జాయిన్ అయింది. తాజాగా అల్లు అర్హ కు మేకప్ వేస్తున్న ఓ వీడియోని బయటకు వదిలారు. అలానే గుణశేఖర్ కుమార్తె మరియు నీలిమ గుణ కూడా ట్విట్టర్ లో ‘లిటిల్ స్టార్ అల్లు అర్హ కోసం సిద్ధంగా ఉంది’ అంటూ కార్వాన్ కు సంబంధించిన ఓ ఫోటోని షేర్ చేశారు. అర్హ ను తన ఫస్ట్ డే షూట్ కోసం గ్రాండ్‌గా స్వాగతం పలకడానికి చిత్ర బృందం కార్వాన్ ను అందంగా అలంకరించారు. కార్వాన్ డోర్ వద్ద ‘ARHA’ లెటర్ బెలూన్ లతో లిటిల్ స్టార్ కు ఘనంగా స్వాగతం పలికినట్లు తెలుస్తోంది.

About Author