వడదెబ్బకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
1 min read

జిల్లా కలెక్టర్ కె.వెట్రీ సెల్వి
కలెక్టరేట్ లో గోడ పత్రికల ఆవిష్కరించిన కలెక్టర్
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: వాతావరణ మార్పుల కారణంగా ప్రజల ఆరోగ్యం ప్రభావం పై ప్రజలకు అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లో సోమవారం NPCCHH (National Programme for Climate Change and Human Health) నేషనల్ ప్రోగ్రాం ఫర్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వాతావరణ మార్పుల ప్రభావం ప్రజల ఆరోగ్యంపై తీవ్రంగా పడుతున్నందున, ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. వేడి తరంగాలు, వర్షపాతం మార్పులు, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. DMHO డా. యు. శోభ మాట్లాడుతూ, NPCCHH కార్యక్రమం ద్వారా ఆరోగ్య శాఖ వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే దిశగా పలు చర్యలు చేపడుతోందని తెలిపారు. గ్రామీణ మరియు పట్టణ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, శిక్షణలు నిర్వహించబడతాయని వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన జాగ్రత్తలను పాటించి, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించాలని అధికారులు పిలుపునిచ్చారు.ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. నరేంద్ర కృష్ణ ,డా: పూజ , డా. భార్గవి, డెమో శ్రీనివాస్ మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

