NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

NAAC ర్యాంకింగు పై వర్సిటీ సెనేట్ హాలులో సమీక్షా సమావేశం

1 min read

కర్నూలు, న్యూస్ ​నేడు:  వచ్చే విద్యాసంవత్సరానికంతా రాయలసీమ యూనివర్సిటీ NAAC అక్రిడిటేషన్ సాధించాల్సిన అవసరముందని యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌ లర్ ఆచార్య వి. వెంకట బసవరావు పిలుపునిచ్చారు. IQAC విభాగం ఆధ్వర్యంలో NAAC ర్యాంకింగు గురించి వర్సిటీ సెనేట్ హాలులో గత రెండురోజులుగా నిర్వహిస్తున్న సమీక్షా సమావేశంలో ఆయన వర్సిటీ ఆచార్యలు, అధ్యాపకులతో సమావేశమయ్యారు. వివిధ కమిటీలను ఏర్పాటుచేసుకొని సమాచారాన్ని క్రమపద్ధతిలో క్రోడీకరించాల్సిందిగా ఆయన సూచించారు. అకడమిక్ అంశాలైన తరగతిగదిబోధన, పరిశోధన, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, కో కరిక్యులర్ కార్యక్రమాలు, క్రీడలు, జాతీయ సేవాపథకం మొదలైన విభాగాల్లో యూనివర్సిటీ చేపడుతున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఆధారాలతోసహా ఫైల్ చేసుకుంటే NAACలో మంచి ర్యాంకు సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ దిశగా వర్సిటీ IQAC ఆధ్వర్యంలో అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరముందని ఆయన హితవు పలికారు. ఈ దిశగా కమిటీల సభ్యులంతా వర్సిటీలోని వివిధ విభాగాల సమాచారాన్ని సేకరించి న్యాక్ ఫార్మేట్లో అప్లోడ్ చాయాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంగా చేపట్టాల్సిన చర్యలను NAAC ర్యాంకింగుల్లో అనుభవమున్న ప్రొఫెసర్ పాల్ క్లి, ప్రొఫెసర్ రవిచంద్ కంచర్ల సమీక్షిస్తారన్నారు. అకడమిక్ సమాచారంతోపాటు అడ్మినిస్ట్రేటివ్ సమాచారాన్నంతా తగిన విధంగా క్రోడీకరించుకోవలసిన అవసరాన్నిగురించి తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ కమిటీలు చేపట్టాల్సిన కార్యాచరణప్రణాళిక గురించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయకుమార్ నాయుడు, వర్సిటీ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య సి. విశ్వనాథరెడ్డి, వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య సుందరానంద పుచ్చ, డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య సి.వి. కృష్ణారెడ్డి, డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య ఎన్. నరసింహులు, IQAC డైరెక్టర్ ఆచార్య ఆర్. భరత్ కుమార్ తోపాటు వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.

About Author