NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఐదేళ్ల సేవలకు ఘన సన్మానం

1 min read

హోలగుంద మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులకు ఘన సత్కారం

హోలగుందన్యూస్ నేడు: హోలగుంద మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఐదేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ ఎంపీడీవో చక్రవర్తి, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఉప సర్పంచ్ దొడ్డ బసప్ప, రుద్ర గౌడ్, చిన్న మల్లయ్య, దొడ్డబసప్ప, ఉప సర్పంచ్ పి. ఖాదర్, అలాగే వార్డ్ సభ్యులు కురువ మల్లయ్య, భాష, ఎస్. వీరేష్, రవికాంత్, అబ్దుల్ హమీద్, అబ్దుల్ రహిమాన్, అబ్దుల్ సుభాన్లకు ఘన సన్మానం చేశారు. ఐదేళ్ల కాలంలో గ్రామ అభివృద్ధి కోసం వారు అందించిన సేవలను అధికారులు ప్రశంసించారు.గత ఐదేళ్లలో గ్రామంలో తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య పనులు, వీధి దీపాల ఏర్పాటు, రహదారుల నిర్మాణం, కాలువల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేశారని కొనియాడారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, “హోలగుందమేజర్ గ్రామ ప్రజలు మాపై ఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పగించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, అధికారులు, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజల సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. ఐదేళ్లపాటు గ్రామ పరిపాలన విజయవంతంగా సాగేందుకు అందరూ సహకరించినందుకు పేరుపేరునా ధన్యవాదాలు” తెలిపారు.ఉప సర్పంచ్ మరియు వార్డ్ సభ్యులు కూడా గ్రామ ప్రజలకు, అధికారులకు, పంచాయతీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధిలో ప్రజల మద్దతు కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభినందనలు తెలిపారు.

About Author