NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమరావతి చట్టబద్ధతపై టిడిపి శ్రేణులు సంబరాలు..          

1 min read

భారీ బైక్ ర్యాలీ, మిఠాయిల పంపిణీ.                     

న్యూస్ నేడు పత్తికొండ :  ఏపీ రాజధాని అమరావతి పార్లమెంటులో చట్టబద్ధత చేయడంపై టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ మేరకు గురువారం పత్తికొండలో టిడిపి శ్రేణులు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అమరావతి రాజధానిపై చట్టబద్ధత తీసుకురావడం పట్ల టిడిపి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తూ ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. స్థానిక హోసూరు బైపాస్ రోడ్డు నుండి స్థానిక నాలుగు స్తంభాల కూడలి వరకు టీడీపీ, బిజెపి జనసేన పార్టీల శ్రేణులు పెద్ద ఎత్తున బైకులతో ర్యాలీ చేపట్టారు. స్థానిక టిడిపి ఎమ్మెల్యే కేజీ శ్యాం కుమార్ నాయకత్వంలో జరిగిన భారీ బైక్ ర్యాలీకి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుండి కూటమి పార్టీల శ్రేణులు భారీగా తరలివచ్చారు. అనంతరం నాలుగు స్తంభాల కూడలి వద్ద జరిగిన బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ రాజధాని విషయంలో మూడుముక్కలాట ఆడి ఏపీకి రాజధాని లేకుండా చేసిన ఘనుడని విమర్శించారు. ఇప్పుడు సైతం అమరావతి రాజధానిపై వైయస్ జగన్మోహన్ రెడ్డి విషం చిమ్ముతున్నాడని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ లోటు బడ్జెట్ తో అభివృద్ధికి ఆ మన దూరంలో ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ అభివృద్ధి వైపు అడుగులేస్తుందని అన్నారు. దీనిని ఓర్వలేని జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై లేనిపోని అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన అపార అనుభవంతో ఏపీ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకుని రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వానికి సహకరించాలన్నారు.

About Author