అమరావతి రాజధాని బిల్లు ఆమోదం – కౌతాళంలో సంబరాలు
1 min read

కౌతాళం, న్యూస్ నేడు : మండల కేంద్రమైన తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం మండల అధ్యక్షులు సురేష్ నాయుడు, మరియు సొసైటీ చైర్మన్ వెంకటపతి రాజు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా కొనసాగించే బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో కౌతాళం మండల కేంద్రంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా స్థానిక కూటమి నాయకులు నాయకులు, కార్యకర్తలు ఒకచోట చేరి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.మండల కేంద్రంలో బైక్ ర్యాలీతో సంబరాలు జరుపుకున్నారు. అమరావతి రాజధాని కొనసాగింపుతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయని పలువురు అభిప్రాయపడ్డారు. రైతుల ఆశలు నెరవేరుతాయని, పెట్టుబడులు పెరిగి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, అమరావతి రాజధాని నిర్ణయం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడుతుందని, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కౌతాళం మండలంలో ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమంలో టిప్పు సుల్తాన్, రాజానంద్, చౌదరి బసవ, కురువ వీరేష్, మూకన్నా, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

