గ్రామ సర్పంచుల సేవలు ఎనలేనివి
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: గ్రామ సర్పంచుల సేవలు ఎనలేనివిని అలాగే సర్పంచుల పదవి విరమణ కావడం బాధాకరం గ్రామ అభివృద్ధి కావాలంటే ఒక సర్పంచ్ తోనే సాధ్యమని ప్యాపిలి ఎంపీపీ గోకుల్ లక్ష్మి, మాజీ ఎంపీపీ దిలీప్ చక్రవర్తి అన్నారు. ఈసందర్భంగా మంగళవారం ప్యాపిలి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఇంచార్జ్ ఎంపీడీవో వెంకటేశ్వర్లు అధ్యక్షతన మండల సర్పంచ్లకు సన్మానం నిర్వహించారు. అనంతరం చిన్న పూజర్ల రామచంద్ర రెడ్డి, బురుగల మధుసూదన్ రెడ్డి, ఏనుగు మర్రి మధన్, వెంగళంపల్లి రంగస్వామి మాట్లాడుతూ తమ గ్రామంలోని చేసిన అభివృద్ధి పనులను తెలుపుతూ గ్రామ సర్పంచి విధుల పట్ల ఎన్ని ఒడిగిడుకులు వస్తున్న తమ ఇంట్లో ఆరోగ్య సమస్యలు, ఆర్థికంగా లోబడిన గ్రామంలో తాగునీరు, డ్రైనేజీ, వీధిలైట్లు తదితర సమస్యలు నెరవేర్చాలని తపనలతో తమ సొంత పనులను కూడా పక్కనపెట్టి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడి పదవి సర్పంచి పదవివని సర్పంచ్లు ముక్త కంఠంతో వారి సేవలను ఎలా వేసుకున్నారు. చిన్న పూజర్లలో సర్పంచి నిధులతో విడుదలయితే గ్రామంలో రెండు అంగన్వాడి సెంటర్లు ప్రైవేటుగా ఉన్నాయి వాటిని ప్రభుత్వ బిల్డింగ్ కట్టించాలని, వెటర్నరీ హాస్పిటల్, హెల్త్ క్లినిక్ సెంటర్, మా గ్రామానికి 7 గ్రామాలు మధ్యలో ఉన్నది గ్రామంలో బ్యాంకు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ఎంపీపీ గోకుల్ లక్ష్మీ మాట్లాడుతూ వారు చెప్పిన వాటిని పరిజ్ఞానంలోకి తీసుకొని మా పదవీకాలంలో నిధులు మంజూరైతే వారు చెప్పిన విధంగా గ్రామ ప్రజల కోసం తప్పకుండా నెరవేరుస్తాం , నిధుల పట్ల జపం కలిగితే ప్రస్తుతం ప్రభుత్వానికి అర్జీ రూపంలో నివేదిక అందించి గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని వారు తెలిపారు. సర్పంచులు గ్రామాల్లో ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని వాటి పరిష్కారానికి ముందుండి పని చేశారని కొనియాడారు. ఇంకా, భవిష్యత్తులో కూడా ఇదే స్పూర్తితో ప్రజాసేవలో ముందుండాలని, గ్రామ అభివృద్ధికి మరింతగా తోడ్పడాలని ఆకాంక్షించారు.అనంతరం 31గ్రామ పంచాయతీల సర్పంచులకు గాను 25మంది సర్పంచులకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి అభినందించారు.ఇంకా ఏడు మంది గ్రామ సర్పంచ్లు హాజరు కాలేదు.ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ గౌరవ అధ్యక్షుడు మొట్టు వెంకటేశ్వర రెడ్డి, పిఆర్ ఎఇ ప్రభాకర్ రెడ్డి,సుబ్బారెడ్డి, ఎర్రి స్వామి, అనిల్, రాయల్, రామ్మూర్తి,జక్కిర్ అన్ని గ్రామాల సర్పంచులు మరియు పంచాయతీ సెక్రెటరీ మరియు తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర కమిటీ నాయకులు, జిల్లా కమిటీ నాయకులు, తుగ్గలి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


