NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మెడికవర్  ‘  లో న్యూరో ‘  వ్యాధులపై అవగాహన

1 min read

వరల్డ్ న్యూరో సర్జన్స్ డే

కర్నూలు, న్యూస్​ నేడు: సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ లో న్యూరో సంబంధిత వ్యాధులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా మెదడు, వెన్నెముక సంబంధిత సమస్యలు, వాటి లక్షణాలు, నివారణ మరియు ఆధునిక చికిత్సలపై ప్రజలకు అవగాహన కల్పించారు.వైద్యులు మాట్లాడుతూ తలనొప్పులు, తల తిరగడం, చేతులు లేదా కాళ్లలో బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా స్ట్రోక్, బ్రెయిన్ ట్యూమర్లు, వెన్నెముక సమస్యలు వంటి వ్యాధులను ప్రారంభ దశలో గుర్తించడం ద్వారా చికిత్స సులభమవుతుందని తెలిపారు.ఆధునిక వైద్య సాంకేతికతల సహాయంతో న్యూరో సర్జరీలో మంచి పురోగతి సాధ్యమవుతుందని, అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో ఈ చికిత్సలు సురక్షితంగా నిర్వహించవచ్చని వైద్యులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ మహేశ్వర్​ రెడ్డి,   మాట్లాడుతూ, “న్యూరో సంబంధిత వ్యాధులు చాలా సందర్భాల్లో సీరియస్‌గా మారే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రజల్లో అవగాహన పెంచడం చాలా అవసరం. సమయానికి గుర్తించి చికిత్స పొందితే అనేక ప్రాణాలను రక్షించవచ్చు. మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు అత్యాధునిక సదుపాయాలతో న్యూరో చికిత్సలు అందిస్తూ ప్రజల ఆరోగ్య రక్షణకు కట్టుబడి ఉంది” అని తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *