సమాజ సేవలో నిరంతరం కొనసాగాలి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు నగరం నందలి మద్దూర్ నగర్ లో గల తోటలో గౌరవ డాక్టరేట్ పురస్కార గ్రహీతలు డాక్టర్ చింతమాను అజయ్ కుమార్, డాక్టర్ ఎస్ జి ఎం సుభాన్ కి విశిష్ట అతిథులు రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి పుల్లయ్య తెలుగు భాష వికాస ఉద్యమ నేత జెఎస్ఆర్కే శర్మ, పారిశ్రామికవేత్త సోమల గూడూరు రుక్మంగాధర్ రెడ్డి, దుశాలో కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి, డాక్టర్ బైలుప్పల షఫీయుల్లా ఏర్పాటుచేసిన అభినందన సభలో, ఎన్టీఆర్ అవార్డు గ్రహీతప్రధాన కార్యదర్శిపి హనుమంతరావు చౌదరి సన్మాన గ్రహీతలు, డాక్టర్ చింతమాను అజయ్ కుమార్ డాక్టర్ ఎస్ జి ఎం సుభాన్ కర్నూలు నగరంలో దాదాపు 40 సంవత్సరాలుగా ప్రజా సేవలు అందించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసినదే, సాంస్కృతిక, సాహితీ, రంగస్థల వేదికలపై, అనేక కార్యక్రమాలు నిర్వహించి ఎందరో రంగస్థలం కళాకారులను ప్రోత్సహించిన వీరు, నాటక రంగంతోపాటు, ప్రజాసేవలో, నిరంతరం వైద్య సేవలలో, ప్రజలతో ప్రజాప్రతినిధులతో ప్రజాసంఘాలతో, కలిసి పనిచేయడం జరిగింది.తమ సేవలను గుర్తించి సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్లను పొందిన తమకు రంగస్థలం కళాకారులు చేస్తున్న ఈ సత్కారానికి అభినందనలకు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, భవిష్యత్తులో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తూ, నిరంతరం సేవా లక్ష్యంగా, కొనసాగుతామని సన్మాన గ్రహీతలు డాక్టర్ చింతమాను అజయ్ కుమార్, డాక్టర్ ఎస్ జి ఎం సుభాన్ తమ అభిప్రాయాలను తెలిపారు. కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సభ్యుల ప్రశంసల మధ్య అభినందన సభ నిర్వహించిన కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ బైలుప్పల షఫీయుల్లాకి రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి పుల్లయ్య గౌరవంగా సన్మానించారు. కర్నూలు జిల్లా రంగస్థల కళాకారులు కళా ప్రియ తిరుపాలు, ఎం చంద్రశేఖర్, చంద్రకాంతరెడ్డి, షేక్షావల్లి, ఋషి కుమార్, సిద్దిక్ భాష, సుభాన్ భాష, వెంకటేశ్వర్లు, రాజన్న, సుబ్రహ్మణ్యం, తమ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

