మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం అందరికీ ఆదర్శం – శొంఠి
1 min read

విజయవాడ, న్యూస్ నేడు: శాసనసభ్యులు బోడే ప్రసాద్ కార్యాలయం పోరంకి లో,తాడిగడప సెంటర్ లో మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి పురస్కరించుకొని పూలే చిత్రపటానికి రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పీత గోపీచంద్ పూలమాల వేసి ఘనంగానివాళులులర్పించారుశొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ మహిళల విద్య పట్ల బలహీన వర్గాలు, దళితుల విద్యాభివృద్ధికి పూలే . ఎనలేని కృషి చేశారన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని, మహిళలు చదువుకుంటూనే ఆయా కుటుంబాలకు బాగుపడతాయని, కొన్ని దశాబ్దాల క్రితమే చెప్పిన మహనీయ వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు. జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని, కుల వివక్షను రూపుమాపడానికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు.సమాజంలో మార్పు రావాలంటే విద్యే ప్రధాన ఆయుధమని పూలే నమ్మేవారని, ముఖ్యంగా మహిళలు చదువుకుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్న మాటలను గుర్తుచేశారు. బాల్య వివాహాలను అరికట్టడం, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం మరియు ఆ కాలంలో వితంతువులకు చేసే గుండు(శిరోముండనం) వంటి అమానుష ఆచారాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారని తెలిపారు.పూలే తన భార్య సావిత్రిబాయికి చదువు నేర్పించి, ఆమెను దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారని, వారిద్దరూ తమ జీవితాలను సమాజ సేవకే అంకితం చేశారని పేర్కొన్నారు.జ్యోతిరావు పూలే పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడిన గొప్ప నాయకుడని కొనియాడారు. పూలే మహిళా విద్య, వితంతు వివాహాలు మరియు వారి సామాజిక గౌరవం కోసం చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.సమాజంలో కుల వివక్ష ఉండకూడదని, అందరూ సమానమని ఆయన నమ్మిన సిద్ధాంతాలు అన్నారు. పూలే ఆలోచనల స్ఫూర్తితోనే ఎన్టీ రామారావు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు,” డ్వాక్రా “గ్రూపులు వంటి విప్లవాత్మక మార్పులు తెచ్చారని తెలిపారు.ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పూలే ఆశయాలకు అనుగుణంగా బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపడుతున్నారని పేర్కొన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలోనే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో జ్యోతిరావు పూలే పేరు మీద బీసీ భవన్ లు నిర్మించామని తెలిపారు.పూలే కి నిజమైన నివాళి ఆయన ఆశయాలను ప్రతి గ్రామంలోనూ కొనసాగించడమేనని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ తాతపూడి గణేష్ రాష్ట్ర సగర కార్పొరేషన్ డైరెక్టర్ తాడిశెట్టి వీరాస్వామి రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ బాలాజీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు వెలగపూడి శంకర్ బాబు పెనమలూరు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు సంగేపు రంగారావు మారుపూడి ధన కోటేశ్వరరావు కోయ ఆనంద ప్రసాద్ అంగిరేకుల మురళి తుమ్మల రామ్ కుమార్ కోనతం సుబ్రహ్మణ్యం బుర్ర వెంకట్ వణుకూరు విక్రమ్ జంపని వెంకటేశ్వరరావు ఈడే అంజిబాబు బలగం కొండ వనమాల వెంకటేశ్వరరావు సుభాని ఆకునూరు సుబ్బారావు మురళి బాజీలు గురుస్వామి బలగం నాగరాజుఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

