బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతి రావుపూలే కి జోహార్లు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు నగరం లోని బిర్లా సర్కిల్ లోని మానవతావాది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదినం సందర్బంగా జిల్లా కురువ సంఘం అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కె. రంగస్వామి,జిల్లా ఉపాధ్యక్షులు పెద్దపాడు ధనుంజయ, బి. వెంకటేశ్వర్లు, కోశాధికారి కె. సి. నాగన్న, నగర కార్యదర్శి బి. రామకృష్ణ, వెంకటేశ్వర్లు, బి. బాలరాజు, మద్దిలేటి, పెద్దపాడు పుల్లన్న తదితరులు విగ్రహానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు.ఈ సందర్బంగా జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కె. రంగస్వామి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను స్ఫూర్తిగా గా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. మహిళల విద్యాభివృద్ధి కోసం మరియు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసారని కొనియాడారు.

