నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ చైర్మన్ గా కొట్టె మల్లికార్జున ను ఏకగ్రీవంగా ఎంపిక
1 min read

ఎంపిక చేసిన నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఢిల్లీ పెద్దలు…
నంద్యాల జిల్లా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ యువ నాయకులు కొట్టె మల్లికార్జున…
ప్రెస్ నోట్: గ్రీన్ ఆంధ్రప్రదేశ్ మిషన్ ధ్యేయంగా గ్రీన్ నంద్యాల జిల్లా లక్ష్యం కోసం కృషి చేస్తా…
కర్నూలు, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఎంపిక అయిన చైర్మన్లు, స్టేట్ బోర్డర్ల తో ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది. డోన్ అసెంబ్లీ బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున నంద్యాల జిల్లా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ చైర్మన్ గా ఎంపికైన సందర్భంగా నేషనల్ వైస్ చైర్మన్ ఉదయానందన్ కుల శ్రేష్ట, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ జమత్ రాయ్ మరియు ఏపీ చైర్మన్ అంబటి నవ కుమార్ ఇతర నేషనల్ బోర్డు, స్టేట్ బోర్డు సభ్యులు ఆయనకు ప్రశంసా పత్రం అందచేసి, అభినందనలు తెలుపుతూ శాలువాతో సత్కరించడం జరిగింది. నంద్యాల జిల్లా ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన కొట్టె మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ నంద్యాల జిల్లా చైర్మన్ గా ఎంపిక అవ్వడం నా జీవితంలో ఒక మధుర ఘట్టం.ఈ అవకాశాన్ని నాకు కల్పించిన బిజెపి పెద్దలు ఎమ్మెల్సీ సోము వీర్రాజు కు, నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఏపీ చైర్మన్ అంబటి నవ కుమార్ కు, నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి పెద్దలు అందరికీ ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ,పర్యావరణము,అటవీ శాఖ ,నీటి వనరులు, గ్రామీణాభివృద్ధి శాఖల సహకారంతో నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను నంద్యాల జిల్లా ప్రభుత్వ అధికారులతో కలిసి సక్రమంగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి గ్రామంలో పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసే విధంగా మొక్కలను పెంచుతూ, యువతను భాగస్వామ్యం చేస్తూ “గ్రీన్ మిషన్ లో భాగంగా గ్రీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధన లో భాగంగా గ్రీన్ నంద్యాల జిల్లా కొరకు కృషి చేస్తాను బిజెపి యువ నాయకులు మరియు నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ నంద్యాల జిల్లా చైర్మన్ కొట్టె మల్లికార్జున మీడియాతో పేర్కొన్నారు.

