గ్రేట్ ఫుల్ గిఫ్ట్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళకు ఆర్థిక సాయం
1 min read

సొసైటీ రానున్న రోజుల్లో సేవా కార్యక్రమాలు మరింత అభివృద్ధి చెందాలన
సుప్రీంకోర్టు న్యాయవాది జి. రోనాల్డ్ రాజు ఆకాంక్ష
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: గ్రేట్ ఫుల్ గిఫ్ట్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక ఇండోర్ స్టేడియం ఎదురుగా లేడీస్ క్లబ్ లో శనివారం దీర్ఘ కాల వ్యాధితో బాధపడుతూ కాలుపాదన్ని కోల్పోయిన మహిళకు సుప్రీం కోర్ట్ న్యాయవాది జి.రోనాల్డ్ రాజ్, ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ నేషనల్ జనరల్ సెక్రెటరీ పి. జీవన్ కుమార్, నేషనల్ దళిత్ కతోలిక్ జెఎసి చైర్మన్ పెరికె వరప్రసాదరావు చేతుల మీదుగా ఆర్థిక సహాయం,దుస్తులు అందజేశారు. సొసైటీ అధ్యక్ష,కార్యదర్శులు సొంగ మధుసూదనరావు,యర్రా జయదాస్ తదితర సభ్యులు స్థాపించిన నాటి నుండి నేటి వరకు నిర్విరామంగా సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని రానున్న రోజుల్లో సేవా కార్యక్రమాలు మరింతగా విస్తరించాలని ఆకాంక్షిస్తూ కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్, బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షులు మత్తే బాబి,దళిత నాయకులు ఈపిచర్ల మణిరాజు మరియు వివిధ సంఘాల నాయకులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.

