వీబీ జీ రామ్ జీ కింద కూలీలకు 100 శాతం పనులు కల్పించాలి
1 min read

నియోజకవర్గ ప్రత్యేక అధికారులు నియోజకవర్గంలోని అన్ని అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాలి
ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు: వీబీ జీ రామ్ జీ కింద కూలీలకు 100 శాతం పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఎంపిడిఓ లను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుండి పిజిఆర్ఎస్, హౌసింగ్, జలధార – జలహారతి, వీబీ జీ రామ్ జీ (VB-G RAM G) తదితర అంశాలపై జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీబీ జీ రామ్ జీ (VB-G RAM G) కి సంబంధించి కూలీలకు పనులు కల్పించడంలో పురోగతి తీసుకొని రావాలన్నారు. కూలీలకు పనులు కల్పించడంలో పత్తికొండ, హాలహర్వి, మద్దికెర లాంటి మండలాలు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుంటున్నాయని, కోసిగి మండలం మాత్రం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోకపోవడం ఏంటని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 3 రోజులలో కూలీలకు పనులు కల్పించడంలో పురోగతి తీసుకొని రాకపోతే తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కోసిగి ఎంపిడిఓ ను ఆదేశించారు. 140 గ్రామ పంచాయతీలలో నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (NMMS) యాప్ ద్వారా కూలీల అటెండెన్స్ లేదని, 3 రోజుల తర్వాత కూడా ఇదే విధంగా ఉన్నట్లైతే ఫీల్డ్ అసిస్టెంట్ ల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారులు నియోజకవర్గంలోని అన్ని అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారులకు త్వరలోనే ముఖ్యమంత్రి గారితో సమీక్ష ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గాల వారీగా ర్యాంకులు ఇస్తారన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారులు కేవలం వారి శాఖ పరమైన కార్యక్రమాలే కాకుండా, నియోజకవర్గంలోని అన్ని అభివృద్ధి పనులను పర్యవేక్షించాలన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారులందరూ తమ నియోజకవర్గాల బడ్జెట్, తలసరి ఆదాయం (Per capita income), మరియు అభివృద్ధి సూచికలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ వారీగా ఏ చెరువు నుండి ఏ చెరువుకు నీరు వెళ్తుంది, చెక్ డ్యామ్‌లు మరియు అదనపు నీరు (surplus water) వెళ్లే మార్గాల వివరాలు, నీటి ప్రవాహ దిశను సూచించే బాణం గుర్తులు, క్యాచ్‌మెంట్ ఏరియా వివరాలు మ్యాప్‌లో ఉండే విధంగా సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తాను గ్రామానికి వచ్చినప్పుడు ఎవరినీ అడగాల్సిన అవసరం లేకుండా, మ్యాప్ చూడగానే పనుల వివరాలు మరియు నీటి కనెక్టివిటీ అర్థం కావాలన్నారుఅదే విధంగా మిగిలిన ఇళ్లను కూడా రూఫ్ లెవెల్ కి తీసుకొని వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హౌసింగ్ ఇంజినీర్ లను ఆదేశించారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, హౌసింగ్ పిడి చిరంజీవి, డ్వామా పిడి నరసింహా రెడ్డి, డీఆర్డీఏ పిడి రమణారెడ్డి, పిజిఆర్ ఎస్ నోడల్ అధికారి దీప్తి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

