NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆలూరు పట్టణంలో ఘనంగా ప్రారంభమైన అన్నా క్యాంటీన్

1 min read

రూ.5కే నాణ్యమైన భోజనం – పేదలకు టీడీపీ సంక్షేమ బహుమతి

టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీమతి వైకుంఠం జ్యోతి చేతుల మీదుగా ప్రారంభోత్సవం – ప్రజా సంక్షేమమే లక్ష్యమని స్పష్టం

ఆలూరు న్యూస్ నేడు : ఆలూరు పట్టణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలిచే అన్నా క్యాంటీన్ నేడు ఘనంగా ప్రారంభమైంది. ఈ క్యాంటీన్‌ను టీడీపీ ఇన్‌చార్జ్  వైకుంఠం జ్యోతి  ప్రారంభించారు. కార్యక్రమానికి స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.ఈ సందర్భంగా  వైకుంఠం జ్యోతి  మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు కేవలం రూ.5కే నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించడం అన్నా క్యాంటీన్ ముఖ్య లక్ష్యం అని తెలిపారు. రోజువారీ కూలీలు, కార్మికులు, వృద్ధులు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు.ప్రజల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ప్రధాన ధ్యేయమని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఆకలి సమస్యను తగ్గించే దిశగా అన్నా క్యాంటీన్ ఒక కీలక అడుగు అని అభిప్రాయపడ్డారు.స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాన్ని హర్షం వ్యక్తం చేస్తూ, సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో భోజనం అందించడం అభినందనీయమని తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *