NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫలితాల్లో అద్భుత విజయాలు

1 min read

– కళాశాల చరిత్రలో సరికొత్త రికార్డు

ద్వితీయ సంవత్సరంలో 85% ఉత్తీర్ణత – చాపల ముస్కాన్ 970 మార్కులతో కళాశాల టాపర్ | ప్రథమ సంవత్సరంలోనూ విద్యార్థుల మెరుగైన ప్రతిభ

హోళగుందన్యూస్ నేడు: బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి కళాశాలకు గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కే. ప్రవీణ ఫలితాల వివరాలను వెల్లడించారు.ద్వితీయ సంవత్సరం విద్యార్థులలో మొత్తం 87 మంది విద్యార్థులకు గాను 74 మంది ఉత్తీర్ణత సాధించి 85 శాతం ఉత్తీర్ణత నమోదు చేసినట్లు తెలిపారు. వీరిలో బైపీసీ విద్యార్థిని చాపల ముస్కాన్ 970/1000 మార్కులతో కళాశాల టాపర్‌గా నిలిచారని పేర్కొన్నారు.అదేవిధంగా షేక్ ఉనేజ 964 మార్కులతో ద్వితీయ స్థానం, చాకలి శిరీష 962 మార్కులతో తృతీయ స్థానం సాధించి విశేష ప్రతిభ కనబరిచారని తెలిపారు.ప్రథమ సంవత్సరం విద్యార్థులు కూడా తమ ప్రతిభను చాటుకున్నారు. మొత్తం 197 మంది విద్యార్థులకు గాను 105 మంది ఉత్తీర్ణత సాధించి 53.2 శాతం ఉత్తీర్ణత నమోదు చేసినట్లు వెల్లడించారు.ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఎన్.ఎస్. సందేశ్ 464 మార్కులతో మొదటి స్థానం, ఎ. అబ్దుల్ కలాం 452 మార్కులతో రెండో స్థానం, ఎస్. ప్రవళిక 449 మార్కులతో మూడో స్థానం సాధించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కే. ప్రవీణ మాట్లాడుతూ,“విద్యార్థుల కృషికి తగిన ప్రతిఫలం లభించింది. కళాశాల చరిత్రలో ఇదే అత్యుత్తమ ఫలితాలు. విద్యార్థులు అత్యధిక మార్కులతో సరికొత్త రికార్డు సృష్టించడం ఎంతో ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు.విజయం సాధించిన విద్యార్థులకు, వారికి అండగా నిలిచిన అధ్యాపక బృందానికి, సహకరించిన తల్లిదండ్రులకు ఆమె ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.కళాశాల చరిత్రలోనే అత్యధిక మార్కులు సాధించి సరికొత్త రికార్డు సృష్టించినందుకు ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *