NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చరిత్ర సృష్టించాలన్న తిరిగి రాయాలన్న ఎస్.ఆర్. విధ్యాసంస్థలకే సాధ్యం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  చరిత్ర సృష్టించాలన్న తిరిగి రాయాలన్న ఎస్.ఆర్. విధ్యాసంస్థలకే సాధ్యం నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో కర్నూల్ ఎస్.ఆర్. కళాశాలల విద్యార్థులు అధ్భుత ప్రతిభ కనపరిచారు. కళాశాల స్థాపించిన ఐదవ సంవత్సరములో కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రథమ ర్యాంకులు సాధించిన విధ్యార్థులను జోనల్ ఇన్చార్జ్ శ్రీ.టి.రఘువీర్  అభినందించారు. ఐదవ సంవత్సరము నందు కూడా అదే స్పూర్తితో ర్యాంకుల పరంపర కొనసాగుతున్నందుకు ఎంతో సంతోషమును తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులతో ఇంత పెద్ద ఎత్తున ఫలితాలను సాధించినందుకు విధ్యార్థులను డీన్. కిరణ్ కుమార్ ని, ఏ.జి.యం.ను ప్రిన్సిపాళ్ళను, లెక్చరర్లను భోదనేతర సిబ్బందిని జోనల్ ఇన్చార్జ్ శ్రీ. టి. రఘువీర్ అభినందించారు. రెసిడెన్షియల్ కళాశాలలో ఈ ఫలితాలను ఎవరు సాధించలేనిది మా ఎస్. ఆర్. జూనియర్ కళాశాల విధ్యార్థులు సాధించడానికి కారణం అనుభవజ్ఞలైన అధ్యాపకులు, క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన ప్రణాళిక, ఒత్తిడి లేని అత్యుత్తమ విద్యాభోదన ప్రధాన కారణం. హాస్టల్ నందు చక్కటి వసతి రుచికరమైన భోజనం, ప్రతిరోజు గుడ్డు, రుచికరమైన అల్పాహారం. పెరిగే పిల్లలకు అవసరమైన న్యూట్రీషియనఫ్ఫుడ్, ఆహ్లాదకరమైన వాతావరణం. ప్రతి విధ్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం వారి భవిష్యత్తుకు ఎస్.ఆర్. జూనియర్ కళాశాల విద్యార్థులకు ఎంతగానో తోడ్పడుతుందని కర్నూల్ ఎస్.ఆర్.విద్యాసంస్థల జోనల్ ఇన్చార్జ్ టి.రఘువీర్  కొనియాడారు.రాష్ట్ర స్థాయిలో అత్యున్నత మార్కులు సాధించి కీర్తి ప్రతిష్టలు సాధించిన విధ్యార్థులను పుష్పగుచ్ఛములిచ్చి శుభాశీస్సులు తెలిపారు.అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన మా విద్యార్థులుజూనియర్ ఎం.పి.సి విభాగం నందు సి.హెచ్. జీవనశ్రావ్య 466, బి. మాధవిలత 465, ఎ. భవాని 465, ఎ.జస్వంత్రెడ్డి 465, మనపాతిమా 465 మార్కులు సాధించడం జరిగినది. మరియు 460 పైగా మార్కులు 39 మంది విధ్యార్థులు సాధించారు.జూనియర్ బై.పి.సి. విభాగం నందు షేక్ మరియా సదాఫ్ 450, షేక్ అనీస్ పాతిమా 447, కె. సుజిత 447, పి.స్పందన 445, సి. హెచ్. పల్లవి 445, ఎమ్.కె.ద్రోణిత 440, మరియు 400 పైగా మార్కులు 29 మంది విధ్యార్థులు సాధించారు.సీనియర్ ఎం.పి.సి. విభాగం నందు వై.నిహల్ 988, బి.ఆదిత్య 988, బి. మధుభావన 987, బి.ప్రవీణ 987, టి.మధుయామిని 987, ఇ.గీతిక 986సీనియర్ బై.పి.సి. విభాగం నందు బి. తాఫిక్ 989, ఎస్. ప్రజ్ఞారాయ్ 988, పి.సహస్ర 988, డి. లక్ష్మీదేవి 985 మార్కులు సాధించడము జరిగినది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *