ఆరోగ్యకరమైన నియోజకవర్గంగా ఏలూరును తీర్చిదిద్దుతా
1 min read

ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్ఠీకరణ
ఫై బ్రో స్కాన్ కు 33 మంది, డెంటల్ వైద్య శిబిరానికి 19 మంది,జనరల్ మెడిసిన్ కు 57 మంది మెడికల్ క్యాంపు కు 109 మంది పేషెంట్లుహాజరు
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: నిరుపేదలకు మెరుగైన వైద్యం అందిస్తూ ఆపదలో అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. మానవసేవే మాధవ సేవ అన్న తలంపుతో ప్రతి గురువారం బడేటి శ్రీహరిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో తన క్యాంపు కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏ ఒక్కరూ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో విరివిగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.బ్రో స్కాన్ కు 33 మంది, డెంటల్ వైద్య శిబిరానికి 19 మంది,జనరల్ మెడిసిన్ కు 57 మంది మొత్తం మీద ఈరోజు మెడికల్ క్యాంపు కు 109 మంది పేషెంట్లు హాజరయ్యారు.ఏలూరు పవర్ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతి గురువారం నిర్వహించే ఉచిత వైద్య శిబిరంలో భాగంగా ఈ వారం ఏలూరు హేలాపురి ఎలైట్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఫై బ్రో స్కాన్, డెంటల్ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. డాక్టర్ సుమంత్ గరిమెళ్ళ, డాక్టర్ గొల్ల గౌతమ్, డాక్టర్ టేకి శివసాయి హరిచందన వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించారు. అంతేకాకుండా లివర్ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు 4వేల రూపాయలతో చేసే అత్యాధునిక ఫై బ్రో స్కాన్ ను ఈ వైద్య శిబిరంలో ఉచితంగా చేశారు. వైద్య పరీక్షలు చేయించుకున్న వారి యోగక్షేమాలను ఎమ్మెల్యే బడేటి చంటి అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని హితవు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మీడియాతో మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గ ప్రజలకు అన్ని మేళ్లు చేకూర్చాలన్న ఏకైక లక్ష్యంతో అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అవసరార్థులకు ప్రభుత్వ సహాయంతో పాటు తన వంతుగా చేయూతను అందించాలన్న లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తూ అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రతి గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించడంతోపాటు 15 రోజులకు ఒకసారి వివిధ వ్యాధులకు సంబంధించి నిష్ణాతులైన వైద్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తూ పేదలకు అందుబాటులోకి వైద్యాన్ని తీసుకువస్తున్నట్లు చెప్పారు. అలాగే కనీసం వైద్య పరీక్షలు కూడా చేయించుకోలేని పేదలకు దాదాపు 40 రకాలైన టెస్టులను రెడ్ క్రాస్ సహకారంతో ఉచితంగా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమాన్ని అందించడంతో పాటు అభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తోందని, ఇదే సమయంలో సేవా కార్యక్రమాలను కూడా వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నట్లు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, టిడిపి జిల్లా మీడియా కో-ఆర్డినేటర్ చల్లా వెంకటసత్య వరప్రసాదరావు, ఏలూరు నగర టిడిపి అధ్యక్షులు చోడే వెంకటరత్నం,కార్యదర్శి రెడ్డి నాగరాజు,పార్టీ సీనియర్ నాయకులు బెల్లపుకొండ కిషోర్, పలువురు కార్పొరేటర్లు,క్లస్టర్ ఇంచార్జిలు, డివిజన్ ఇన్చార్జిలు, లైన్స్ క్లబ్ అధ్యక్షులు ఎం యహోధనబాబు, కార్యదర్శి దుండి కృష్ణ , కోశాధికారి రెహమాన్ జవారి షేక్ తదితరులు పాల్గొన్నారు.

