NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్.అంబేద్కర్ గురుకులం జూనియర్ కళాశాల,వట్లూరు విద్యార్థులు విజయభేరి

1 min read

విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపాల్ దాసరి.మేరీ ఝాన్సీ రాణి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఈ విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో_  పి.ఎమ్.డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గురుకులం జూనియర్ కళాశాల,వట్లూరు విద్యార్థులు విజయభేరి మోగించారు.యoపిసి మొదటి సంవత్సరం ఫలితాలలో 40 మంది విద్యార్థులకు 38 మంది పాసయ్యారు.ఉత్తీర్ణతా శాతం 98%. జె.కుసుమ అను విద్యార్థి 470 మార్కులకు 464 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. జి.సుష్మ అను విద్యార్థి 452 మార్కులతో ద్వితీయ స్థానం మరియు  ఆర్.మానస అను విద్యార్థి 449 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు. Bi.P.C మొదటి సంవత్సరం ఫలితాల్లో 34 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే 34 మంది పాసయ్యారు ఉత్తీర్ణత శాతం 100%.  యు.అనూష అను విద్యార్థి 455 మార్కులకు 443 మార్కులు సాధించి కళాశాల టాపర్ గా నిలిచింది.పి.నవీన అను విద్యార్థి 440 మార్కులు తో ద్వితీయ స్థానం మరియు కె.సుజని అను విద్యార్థి 438 మార్కులుతో తృతీయ స్థానం సాధించారు. Bi.P.C ద్వితీయ సంవత్సరంలో 35 మందికి 34 మంది పాసయ్యారు.ఉత్తీర్ణతా శాతం 99%. ఫలితాల్లో 1000 మార్పులకు గాను 967 మార్కులతో పి.లీనా ప్రథమ స్థానంలో నిలిచింది. 960 మార్కులుతో సిహెచ్. స్వాతి ద్వితీయ స్థానం మరియు 959 మార్కులతో యు.తేజస్వి తృతీయ స్థానం లో నిలిచారు. M.P.C. ద్వితీయ సంవత్సరంలో 36 మంది విద్యార్థులకు 36 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 100%. కే.షర్మిల అను విద్యార్థి 1000 మార్కులకు 950* మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. పి.రామశరణ్య అను విద్యార్థి 936 మార్కులతో ద్వితీయ స్థానం మరియు జి. నక్షత్రా అను విద్యార్థి 935 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు.ఈ సందర్భంగా  పాఠశాల ఉపాధ్యాయులను మరియు విద్యార్థులను ప్రిన్సిపల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి  అభినందించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *