పట్టణ పిజిఆర్ఎస్ కు 94 అర్జీలు
1 min read

ప్రజా సమస్యలను పెండింగ్ లో ఉంచొద్దు
నాయకులందరూ కలిసికట్టుగా పని చేయాలి..
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి అధ్యక్షతన ‘ప్రజా సమస్యల ఫిర్యాదుల స్వీకరణ’ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య హాజరై పట్టణ ప్రజల నుండి అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించారు. అర్జీలను పెండింగులో ఉంచకుండా ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిందేనని ఎమ్మెల్యే పట్టణ అధికారులను ఆదేశించారు. ఈ పిజిఆర్ఎస్ కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది.94 అర్జీలు స్పందన కార్యక్రమానికి వచ్చాయి.పట్టణంలోని మారుతి నగర్ కాలనీలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేకంగా ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు.గాంధీనగర్ కాలనీకి చెందిన ఐదు మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కలను ఎమ్మెల్యే వారి ఇంటికి వెళ్లి అందజేశారు.నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాల స్థానిక టిడిపి కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ప్రజా ప్రతినిధిగా చేయాలనేదే లక్ష్యమని రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కార్యకర్తలకు సూచించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాసులు,మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజనీర్ దినేష్ కుమార్,టిపిఓ రంగస్వామి, టిడిపి పట్టణ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి,సొసైటీ చైర్మన్ ముర్తు జావలి,డాక్టర్ వనజ తదితరులు పాల్గొన్నారు.


