నీటి వనరులకు జలహారతి..
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: డోన్ మండలంలోని యాపదీన్నేగ్రామంలో స్వర్ణ ఆంధ్రా – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం భాగంగా “వాటర్ పాజిటివ్ ఆంధ్రా” థీమ్‌తో జలధార జలహారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని నీటి వనరులకు జలహారతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నీరు జీవనాధారం కావడంతో దాని సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. భూగర్భ జలాలను సంరక్షించడం, వర్షపు నీటిని నిల్వ చేయడం, చెరువులు, కాలువలను పరిరక్షించడం ద్వారా నీటి సమస్యలను తగ్గించవచ్చనిఎమ్మెల్యే పేర్కొన్నారు.అలాగే స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పరిశుభ్రత పెంపొందించడమే కాకుండా, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామ ప్రజలు, యువత, మహిళా సంఘాలు కలిసి పనిచేస్తే గ్రామ అభివృద్ధి వేగవంతమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు.ఈ సందర్భంగా చెరువుల ప్రక్షాళన మరియు పునరుద్ధరణకు సంబంధించిన ప్రణాళికలను ఎమ్మెల్యే సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.


